
సాధారణంగా లేస్ ప్యాకెట్లను చిరు తిండిగా ఉపయోగిస్తూంటారు. అయితే ఒక్కోసారి లేస్ ప్యాకెట్ లో ఉండే లేస్ ని చూస్తే షాక్ అవుతూ ఉంటారు. లేస్ ప్యాకెట్లను చిప్ లకు బదులుగా గాలితో నింపడం గురించి ప్రజలు ఇప్పటికే జోక్ లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఓ వ్యక్తి లేజ్ ప్యాకెట్లో కేవలం రెండు లేస్ నే చూసి షాక్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కెర్లు కొడుతుంది. ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫారమ్ లో వైరల్ గా మారింది.
కశ్యప్ అనే వ్యక్తి ఐదు రూపాయల క్లాసిక్ సాల్ట్ అనే లేస్ ప్యాకెట్ ను తెచ్చుకున్నాడు. ఇది తెరిచి చూడగా అందులో కేవలం రెండు లేస్ మాత్రమే ఉన్నాయి. ఫ్యాకెట్ మొత్తం గాలితో నింపి.. రెండు లేస్ మాత్రమే పెట్టడంతో అతను షాక్ అయ్యాడు. ఇదేనా ప్రమాణం? అని అతను ప్రశ్నించాడు. నమ్మకమైన కస్టమర్ గా ఇది అంచనాల కంటే తక్కువగా ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది.
ఈ వీడియై పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ‘ఓహ్ గుడ్ మీకు కేవలం రెండు చిప్స్ అయినా ఉన్నాయి.. నేను ఇంకా కేవలం గాలితో నింపేశారనుకున్నా.. అదృష్ట వంతులు’ అని రాసుకొచ్చాడు. మరొకరు.. ‘ఓ మీకు ఎక్స్ ట్రా పర్సంటేజ్ వచ్చింది భయ్యా.. కంగ్రాట్స్’.
ఇంకొక వినియోగదారుడు ‘జస్ట్ క్యూరియస్.. ఈ వీడియో రికార్డ్ చేయడానికి కేవలం రెండు లేదా మూడు చిప్స్ మాత్రమే ఉంటాయని మీరు ఎలా ఊహించారు? మేము కూడా అలానే చేస్తాం’ చెప్పండి.. బ్రాండ్ పై దావా వేస్తం అని అడిగారు. దానికి కశ్యప్ సమాధానం ఇస్తూ.. ఇది బరువు చాలా తక్కువగా ఉంది. నేను ముందు ఇందులో ఏమీ ఏండదని అనుకున్నా.. కానీ రెండు చిప్స్ ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు.’
Dear @Lays_India @PepsiCoIndia , today’s snack session took an unexpected turn. Purchased a 5 rupee classic salted pack with hopeful anticipation, only to unveil a mere TWO chips inside. Is this the new standard? As a loyal customer, this falls short of expectations. pic.twitter.com/gGUl8Wq4MI
— Divyanshu Kashyap (@Divyans60201407) December 8, 2023
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..