Viral Video: స్విమ్మింగ్‌పూల్‌లో సింక్‌హోల్‌.. 43 అడుగుల లోతులోకి పడిపోయి వ్యక్తి మృతి.. వైరలవుతోన్న భయానక వీడియో

|

Jul 28, 2022 | 5:02 PM

Shocking Video: సాధారణంగా వర్షాకాలంలో రోడ్డు కుచించుకుపోవడం మనం చూసి ఉంటాం. అలాగే కొన్ని పర్వత ప్రాంతాల్లోనూ నేల బాగా కుదించుకుపోతుండడం మనం గమనించి ఉంటాం. అయితే స్విమ్మింగ్ పూల్‌లో ఇలాంటి సంఘటన జరగడం ఇప్పుడు వైరల్‌గా మారింది.

Viral Video: స్విమ్మింగ్‌పూల్‌లో సింక్‌హోల్‌.. 43 అడుగుల లోతులోకి పడిపోయి వ్యక్తి మృతి.. వైరలవుతోన్న భయానక వీడియో
Swimming Pool
Follow us on

Shocking Video: సాధారణంగా వర్షాకాలంలో రోడ్డు కుచించుకుపోవడం మనం చూసి ఉంటాం. అలాగే కొన్ని పర్వత ప్రాంతాల్లోనూ నేల బాగా కుదించుకుపోతుండడం మనం గమనించి ఉంటాం. అయితే స్విమ్మింగ్ పూల్‌లో ఇలాంటి సంఘటన జరగడం ఇప్పుడు వైరల్‌గా మారింది. అదికూడా ఏకంగా 43 అడుగుల లోతులో నేల కుచించుకపోయింది. అనుకోకుండా జరిగిన ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అంతేకాదు స్విమ్మింగ్‌ పూల్‌ ఫ్లోర్‌ మొత్తం ధ్వంసమవుతుంది. కొలనులోని నీరంతా ఆ సింక్‌ హోల్‌లోకి వేగంగా పోతుంది. ఇజ్రాయెల్‌లో జరిగిన ఈ షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో బాగా వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే..

ఇజ్రాయెల్‌ దేశంలోని కార్మీ యోసెఫ్‌లోని ఓ స్విమ్మింగ్‌పూల్‌లో గ్రాండ్‌గా పార్టీ జరుగుతుంటుంది. అందరూ జలకాలాడుతూ ఎంజాయ్‌ చేస్తుంటారు. కొందరు పూల్‌లో దిగి స్నానం చేస్తుంటే మరికొందరు నీటితో సరదాగా ఆడుకుంటున్నారు. ఇంతలోనే అకస్మాత్తుగా జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్‌ కు గురిచేసింది. ఉన్నట్లుండి కొలనులో ఒక సింక్‌ హోల్‌ ఏర్పడుతుంది. అందులో ఒక వ్యక్తి పడిపోతాడు కూడా. సుమారు 43 అడుగుల లోతులోకి కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతాడు.  పలువురు గాయపడతారుకూడా. ఇక కొలను మొత్తం ధ్వంసమైపోతుంది. కొలనులో ఈత కొట్టడానికి ఉపయోగించే గొట్టాలన్నీ నీటితో పాటు సింక్‌హోల్‌లోకి కొట్టుకుపోతాయి. కాగా ఈ ఘటన ఎలా జరిగిందో ఎందుకు జరిగిందో ఇప్పటివరకు తెలియడం లేదు. అయితే భూగర్భ జలాల కారణంగా నేల కింది భాగం కరిగిపోయినప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..