Viral Video: వామ్మో.. మూడుసార్లు కాటేసినా, రక్తం కారుతున్నా వెనక్కు తగ్గలే.. భయానక పామును ఎలా పట్టుకున్నాడో మీరే చూడండి

Snake Video: సాధారణంగా పాములను చూడగానే భయంతో ఒళ్లంతా చెమటలు పడతాయి. విషం ఉన్నా, లేకపోయినా పొరపాటున అవి ఎదురుపడితే క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడి నుంచి తప్పించుకుంటాం. అయితే ఇటీవల కొందరు పాములను..

Viral Video: వామ్మో.. మూడుసార్లు కాటేసినా, రక్తం కారుతున్నా వెనక్కు తగ్గలే.. భయానక పామును ఎలా పట్టుకున్నాడో మీరే చూడండి
Snake

Edited By:

Updated on: Aug 25, 2022 | 7:05 AM

Snake Video: సాధారణంగా పాములను చూడగానే భయంతో ఒళ్లంతా చెమటలు పడతాయి. విషం ఉన్నా, లేకపోయినా పొరపాటున అవి ఎదురుపడితే క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడి నుంచి తప్పించుకుంటాం. అయితే ఇటీవల కొందరు పాములను సైతం చాకచక్యంగా పట్టుకుంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. నెటిజన్లు కూడా వీటిని చూడడానికి ఆసక్తి చూపిస్తుండంతో అవి క్షణాల్లోనే వైరల్‌గా మారిపోతున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియో చాలా భయానకంగా ఉంది. ఎందుకంటే ఇందులో తనను పట్టుకునేందుకు వచ్చిన వాడిని ఏకంగా మూడుసార్లు కాటేస్తుంది పాము. అయితే అతను మాత్రం వెనక్కు తగ్గడు. రక్తం కారుతున్నా పామును బంధించేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు ఎలాగోలా పామును బంధిస్తాడు.

‘world_of_snakes’ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అప్‌లోడ్ చేసిన ఈ వీడియోలో ముందుగా ఓ పెద్ద పాము పరిగెడుతూ ఉంటుంది. ఓ వ్యక్తి దానిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అది కాటేస్తుంది. దీంతో అతనికి రక్తం కూడా వస్తుంది. దీంతో పామును వదిలేస్తాడు. రెండోసారి పట్టుకునేందుకు పోగా మరోసారి కాటేస్తుంది. మూడోసారి కూడా సేమ్‌ సీన్‌ రిపీటవుతుంది. అయితే వెనక్కు తగ్గని అతను ఎట్టకేలకు పామును బంధిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసినా వారందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us