
లక్నోలోని రద్దీగా ఉండే రోడ్డు వద్ద, ఒక చిన్న ప్రమాదంలో తన వాహనాన్ని దెబ్బతీసినందుకు కోపంగా ఉన్న ఒక మహిళ పిజ్జా డెలివరీ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టింది. అంతేకాకుండా, వాహనానికి జరిగిన డ్యామేజ్ కోసం రూ.30,000 డిమాండ్ చేసింది. డబ్బులు చెల్లించకపోతే తాను చట్టపరంగా చర్యలు తీసుకుంటానని బెదిరించింది. ఆ సంఘటన వీడియోను స్థానికులు రికార్డ్ చేశారు. దీనిలో ఆ మహిళ డెలివరీ వ్యక్తిపై ఆధిపత్యం చెలాయిస్తుంది. రైడర్‌పై దాడి చేసినందుకు ఆ మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
లక్నోలోని రద్దీగా ఉండే వీధిలో ఒక డెలివరీ వ్యక్తి ప్రమాదవశాత్తు తన ముందున్న మహిళా రైడర్‌ను ఢీకొట్టడంతో ఇదంతా జరిగింది. ఆగ్రహించిన మహిళ డెలివరీ వ్యక్తిని చెంపదెబ్బ కొట్టి, అతని ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించింది. ఇంతలో డెలివరీ వ్యక్తి తన తోడు రైడర్లకు ఫోన్ చేశాడు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు.
In UP’s Lucknow, a woman slapped a pizza delivery agent following a minor incident of road rage. She demanded ₹30k for the damage. pic.twitter.com/1GudxU6FDH
— Piyush Rai (@Benarasiyaa) September 12, 2025
స్థానికులు కూడా గొడవలో జోక్యం చేసుకుని పరిస్థితిని శాంతింపజేయడానికి ప్రయత్నించారు. దృశ్యాన్ని రికార్డ్ చేస్తున్న వ్యక్తి ఆ మహిళకు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి డ్యామేజ్ క్లెయిమ్ చేసుకోవచ్చని చెప్పాడు. ఆమెకు ఎవరినీ చెంపదెబ్బ కొట్టే హక్కు లేదని కూడా అతను ఆమెకు చెప్పాడం వినవచ్చు. దానికి ఆ మహిళ, “ఆప్ జ్ఞాన్ మత్ దిజియే, అగర్ ఇస్నే నుక్సాన్ కియా హై తో యాహి పైసే దేగా. ఆప్ పోలీస్ బులైయే” అని బదులిచ్చింది.
వీడియోపై నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. దాడి చేసినందుకు ఆమెను అరెస్టు చేయాలని పోస్టులు పెట్టారు. ఆమెకు ఇలా చేయడానికి అనుమతించే ప్రత్యేక హక్కు ఎవరిచ్చారు అంటూ మరికొందరు కామెంట్స్ చేశారు.