Viral Video: సాధారణంగా అడవిలో అత్యంత క్రూర మృగాలు ఏవి అంటే టక్కున సింహం, పులి, చిరుత పులి అని సమాధానం చెబుతారు. ఎందుకంటే.. అడవిలో జీవించే ఏ జీవి అయినా వీటిని చూస్తే హడలిపోతాయి. పొరపాటున వాటి కంట పడ్డాయో అదే వాటికి చివరి రోజు అవుతుంది. సింహం, పులి, చిరుత పులి వేట ఒక్కొక్క దానిని ఒక్కో స్టైల్. అయినప్పటికీ.. వేటాడితే అవతలి జంతువు ఆహారం అవ్వాల్సిందే. కానీ, ఒక్కోసారి సీన్ రివర్స్ అవుతుంటుంది. కొన్ని జంతువులు ధైర్యం తెచ్చుకుని మరీ సింహం, పులి, చిరుత పులులకు ఎదురు తిరుగుతాయి. వాటితో పోరాడి ప్రాణాలు దక్కించుకుంటాయి. ముఖ్యంగా తమ పిల్లలపై దాడి చేసినప్పుడు అవి ఎక్కడా లేని శక్తిని తెచ్చుకుని పోరాటం సాగిస్తాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అడవి పంది.. తన బిడ్డపై దాడి చేసిన చిరుత పులికి చుక్కలు చూపించింది. వెంటాడి వెంటాడి మరీ దాడి చేసింది. తల్లి పందిని చూసిన చిరుత ప్రాణ భయంతో పరుగులు తీసింది. ఈ సన్నివేశాన్ని సఫారీలో ప్రయాణిస్తున్న పర్యాటకులు కెమెరాల్లో రికార్డ్ చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో అడవిలోని మైదాన ప్రాంతంలో పంది పిల్ల మేత మేస్తోంది. దీనిని గమనించిన చిరుత పులి.. తనుకు ఈ పూటకు ఆహారం దొరికిందని సంబరపడిపోయింది. నేరుగా అటాక్ చేసి.. పంది పిల్లను నోట కరుచుకుని పరుగులు తీసింది. అయితే, అటువైపు నుంచి ఈ దృశ్యాన్ని చూసిన తల్లి పంది.. చిరుతపై అటాక్ చేయబోయింది. తల్లి పంది రాకను గమనించిన చిరుత.. ప్రాణ భయంతో పంది పిల్లను వదిలేసి పరుగులు తీసింది. అయినప్పటికీ ఆ తల్లి పంది వదల్లేదు. దానిని ఒక రేంజ్‌లో ఉరికించింది. ఈ దృశ్యానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అడవి జంతువుల జీవితంపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తల్లి ప్రేమపై ప్రశంసలు కురిపిస్తూ.. ఆ తల్లి పంది ధైర్యానికి సలామ్ కొడుతున్నారు.
Also read:
Health care ideas: ఇవి తిన్నా, తాగినా క్యాన్సర్ బారిన పడటం ఖాయం.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..!
AP Weather Alert: ముంచుకొస్తున్న ‘అసాని’.. ఆ జిల్లాలపై ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం..!