Viral Video: చిన్న జంతువు చేసిన శబ్ధానికే హడలిపోయిన చిరుత.. ఎలా పరుగులు తీసిందో చూస్తే నవ్వులే నవ్వులు..!

Viral Video: అడవి ప్రపంచం ( వైల్డ్‌లైఫ్ వీడియో ) నిజంగా వింతగా ఉంటుంది. ఇక్కడ ఏ క్షణం ఏం జరుగుతోందో ఊహించడం చాలా కష్టం.

Viral Video: చిన్న జంతువు చేసిన శబ్ధానికే హడలిపోయిన చిరుత.. ఎలా పరుగులు తీసిందో చూస్తే నవ్వులే నవ్వులు..!
Leopard

Updated on: May 09, 2022 | 8:10 AM

Viral Video: అడవి ప్రపంచం ( వైల్డ్‌లైఫ్ వీడియో ) నిజంగా వింతగా ఉంటుంది. ఇక్కడ ఏ క్షణం ఏం జరుగుతోందో ఊహించడం చాలా కష్టం. అడవిలో జీవించే ఒక్కో జీవికి ఒక్కో నియమం ఉంటుంది. ఈ విధంగా సింహం, పులి, చిరుతపులికి కూడా ఉంటుంది. సాధారణంగా అయితే, ఈ క్రూర మృగాల కంటే మరే ఇతర జంతువు పడినా.. ఆ రోజే దానికి ఆఖరి రోజు అవుతుంది. అందుకే ఈ క్రూర మృగాల కంటపడుకుండా చిన్నా, చితకా జంతువులు తప్పించుకుని తిరుగుతాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు.. కొన్నిసార్లు చాలా తెలివిగా ప్రవర్తి్స్తాయి. నిజానికి చెప్పుకోవాలంటే.. బలహీనమైన జంతువులు బలమైన జంతువులకు భయపడుతాయి. కానీ, ఇక్కడ కొన్నిసార్లు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తే బలమైన జంతువులను సైతం ఓడించి పైచేయి సాధించొచ్చు.

ఇదిలాఉంటే.. తాజాగా చిరుతకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. సాధారణంగా అడవిలోని మిగతా జంతువులను హడలెత్తించే చిరుత.. ఓ చిరు జీవి చేసిన శద్ధాని హడలిపోయింది. ఓ చిరుత పులి అప్పుడే ఓ జింకను వేటాడింది. మాంచి ఆకలి మీదున్నట్లుంది ఆదరాబాదరాగా తింటోంది. ఇంతలో హైనా శబ్ధం చేయడంతో చిరుత హడలిపోయింది. వెంటనే తన వేట మాంసాన్ని తీసుకుని చెట్టుపైకి చకచకా ఎక్కేసింది. అయితే, హైనా ఎక్కడ తన ఆహారాన్ని ఎత్తుకెళ్తుందోననే భయంతోనే చిరుత చెట్టుపైకి ఎక్కినట్లు స్పష్టమవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి