Watch Video: వామ్మో.. అదేం పట్టుడక్కా.. పాములకే చుక్కలు చూపించావ్‌గా.. వీడియో చూస్తే..

మహారాష్ట్రలోని కొల్హాపూర్లో భయానక సంఘటన వెలుగు చూసింది. ఓ విగ్రహాల వర్క్‌షాప్‌లో ఉన్నట్టుండి ఒకే సారి మూడు పాములు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసిన కార్మికులు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసి.. స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో స్నేక్ క్యాచర్ వాటిని ఎంతో చాకచక్యంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Watch Video: వామ్మో.. అదేం పట్టుడక్కా.. పాములకే చుక్కలు చూపించావ్‌గా.. వీడియో చూస్తే..
Viral Video

Updated on: Dec 09, 2025 | 12:18 AM

సాధారణంగా వర్షాలు, చలికాలంలో జనావాసాల్లో పాములు కనిపించడం సహజం. అయితే ఇళ్ల మధ్యలో ఒకటి లేదా రెండు పాములు కనిపిస్తే ఓకే కానీ.. మహారాష్ట్రలోని ఒక వర్క్‌షాప్‌లో మాత్రం ఏకంగా మూడు పాములు ప్రత్యక్షమయ్యా. ఆ మూడు పాములు ఒకే చోట కనిపించడంతో అక్కడి కార్మికులు షాక్ అయ్యారు. వాటిని చూసిన భయంతో వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగులు పెట్టారు. వెంటనే షాపు యజమానికి, స్నేక్ క్యాచర్‌ శివానికి సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థానికి చేరుకున్న శివాని.. ఎంతో చాకచక్యంగా ఆ మూడు పాముటను ఒడిసి పట్టుకుంది. ఆ తర్వాత వాటిని సమీపంలోని అడవిలో వదిలి పెట్టింది.

ఈ దృశ్యాలను అక్కడున్న కార్మికులు, గ్రామస్తులు ఎంతో ఇంట్రెస్టింగ్‌ చూశారు. ఈ సంఘటనకు సంబంధించిన మొత్తం దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఆడ పిల్ల ధైర్యంగా పాములను పట్టుకోవడం చూసిన జనాలు శివాని ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ ఘటనపై స్నేక్ క్యాచర్ శివాని మాట్టాడుతూ.. ఈ కాలంలో, పాములు చాలా చోట్ల కలిసి కనిపిస్తాయి. అందువల్ల, ఏకాంత, చిత్తడి లేదా చీకటి గుహలలోకి వెళ్ళేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండండని తెలిపింది. ఎందుకంటే ఇది పాముల సంభోగం కాలం, సాధారణంగా అక్టోబర్, ఫిబ్రవరి మధ్య పాములు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ కాలంలో ఆడ పాముల వాసనను పసిగట్టి మగ పాములు ఒకే చోట పెద్ద సంఖ్యలో గుమిగూడతాయి. కాబట్టి ఒకే చోట రెండు-మూడు పాములు కనిపించడం సహజం అని ఆమె చెప్పుకొచ్చింది.

వీడియో చూడండి.


మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.