Viral Video: నూడుల్స్‌ సూప్‌లో ఐస్‌క్రీమ్‌.. లొట్టలేసుకుని తింటోన్న కస్టమర్లు.. ఎక్కడంటే..

|

Mar 25, 2022 | 8:00 AM

రెగ్యులర్‌ వంటకాలు, ఆహార పదార్థాలు తిని విసుగొచ్చిందేమో ఇటీవల కొందరు వెరైటీ వంటకాలు ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త కాంబినేషన్లతో రెసిపీలు ప్రయత్నిస్తున్నారు.

Viral Video: నూడుల్స్‌ సూప్‌లో ఐస్‌క్రీమ్‌.. లొట్టలేసుకుని తింటోన్న కస్టమర్లు.. ఎక్కడంటే..
Ramen Noodles
Follow us on

రెగ్యులర్‌ వంటకాలు, ఆహార పదార్థాలు తిని విసుగొచ్చిందేమో ఇటీవల కొందరు వెరైటీ వంటకాలు ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త కాంబినేషన్లతో రెసిపీలు ప్రయత్నిస్తున్నారు. అనంతరం వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఈ వెరైటీ వంటకాల్లో కొన్ని ఆకట్టుకుంటుంటే.. మరికొన్ని మాత్రం వికారం తెప్పిస్తున్నాయి. తాజాగా అలాంటి కొత్త వంటకం ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సాధార‌ణంగా నూడుల్స్, ఐస్‌క్రీం వేర్వేరుగా తింటాం. కానీ ఓ చోట మాత్రం ఏకంగా నూడుల్స్ సూప్‌లోనే ఐస్‌క్రీం ఏసుకొని లాగించేస్తున్నారు. ఈ వెరైటీ వంటకానికి సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ‘ఇదేం వంటకంరా బాబూ.. మీ టేస్ట్‌ తగలయ్యా’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

కాగా ఈ కొత్త వంట‌కానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది జ‌పాన్‌. ఒసాకా సిటీలో ఉన్న ఫ్రాంకెన్ రెస్టారెంట్ లో ఈ వెరైటీ వంటకాన్ని తయారుచేసి కస్టమర్లకు సర్వ్‌ చేస్తున్నారు. కాగా ఇక్కడి ప్రజలు రామెన్ నూడుల్స్ ను ఇష్టంగా తీసుకుంటారు. తాజాగా ఈ వంటకానికి ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్‌ను జోడించారు. రామెన్ నూడుల్స్‌సూప్‌పై మెత్తటి ఐస్‌క్రీమ్ టాపింగ్‌తో అలంకరించి సర్వ్‌ చేస్తున్నారు. దీంతో రెస్టారెంట్ కొచ్చిన కస్టమర్లు లొట్టలేసుకుంటూ మరీ ఈ వంట‌కాన్ని తింటున్నారు. కాగా ఈ వంటకం వీడియోను జెస్సే ఒగుండిర‌న్ అనే ఫుడ్‌బ్లాగర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

Also Read:Weekend Special Recipe: మీకు టేస్టీ, స్పైసీ ఫుడ్ తినాలని అనిపిస్తే.. శెనగ పిండితో ఇలా చేయండి..

Mango Farming: మామిడి ప్రియులకు చేదు వార్త.. పండ్ల రారాజును మింగేస్తున్న తామర పురుగు

BEL Recruitment 2022: బీఈ/బీటెక్‌ అర్హతతో.. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో 63 ట్రైనీ, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు..