Viral Video: వాహ్‌..ఈ బ్యూటీ ముందు హీరోయిన్‌ కూడా జుజుబీ… ట్రాన్స్‌జెండర్‌ అందానికి నెటిజన్స్‌ ఫిదా..!

సోషల్‌ మీడియా 'ప్రపంచం'లో ఎప్పుడు, ఎవరు, ఎలా వైరల్ అవుతారో ఊహించడం చాలా కష్టం. అనేక మంది ఫేమస్‌ కావడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం ఏమీ చేయకుండానే జస్ట్‌ ఇలా వచ్చి అలా వైరల్‌ అయిపోతుంటారు. ప్రస్తుతం అలాంటిదే...

Viral Video: వాహ్‌..ఈ బ్యూటీ ముందు హీరోయిన్‌ కూడా జుజుబీ... ట్రాన్స్‌జెండర్‌ అందానికి నెటిజన్స్‌ ఫిదా..!
Beautiful Transjender In Ra

Updated on: Aug 20, 2025 | 6:10 PM

సోషల్‌ మీడియా ‘ప్రపంచం’లో ఎప్పుడు, ఎవరు, ఎలా వైరల్ అవుతారో ఊహించడం చాలా కష్టం. అనేక మంది ఫేమస్‌ కావడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ కొంతమంది మాత్రం ఏమీ చేయకుండానే జస్ట్‌ ఇలా వచ్చి అలా వైరల్‌ అయిపోతుంటారు. ప్రస్తుతం అలాంటిదే వీడియోసోషల్ మీడియాను ఊపేస్తుంది. ఇందులో ఊదా రంగు చీరలో ఉన్న ట్రాన్స్‌జెండర్‌ కదులుతున్న రైలులో ప్రయాణికుల నుండి డబ్బు తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. కానీ, నెటిజన్లు మాత్రం ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు. పరిస్థితి ఎలా ఉందంటే ట్రాన్స్‌జెండర్‌ అందాన్ని చూసిన తర్వాత నెటిజన్స్‌ ఆమెను ‘ట్రెయిన్ కీ రాణి’, ‘స్వర్గలోక అప్సర’ అని పిలుస్తున్నారు.

సాధారణంగా ట్రాన్స్‌జెండర్‌ల నుంచి తప్పించుకోవడానికే మెజార్టీ పీపుల్ ప్రయత్నిస్తారు, కానీ ఈ వీడియో సోషల్‌ మీడియా యూజర్స్‌ హృదయాలను గెలుచుకుంది. వైరల్ క్లిప్‌లో ఊదా రంగు చీరలో ఉన్న ఒక ట్రాన్స్‌జెండర్ జనరల్ బోగీలో కూర్చున్న ప్రయాణీకుల నుండి డబ్బు తీసుకుంటున్నట్లు చూడవచ్చు, ఆపై పై సీటు మీద కూర్చున్న ఒక యువకుడు ఆమెకు డబ్బు ఇస్తాడు. ఆమె ఆశీర్వాదం తీసుకున్న తర్వాత, ట్రాన్స్‌జెండర్‌ను ఒకసారి కెమెరా వైపు చూడమని అభ్యర్థిస్తాడు.

వీడియోలో ట్రాన్స్‌జెండర్ కూడా ఏమీ ఆలోచించకుండా నవ్వుతూ కెమెరా వైపు చూస్తుంది. ఆ తర్వాత అక్కిడి నుంచి ముందుకు కదులుతుంది. అయితే, ట్రాన్స్‌జెండర్ ఈ చిన్న దృశ్యం సోషల్ మీడియాలో లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది. ట్రాన్స్‌జెండర్ సౌమ్యం, అందాన్ని నెటిజన్లు ఇష్టపడ్డారు.

వీడియో చూడండి:

ఈ వీడియోను కేవలం మూడు రోజుల్లోనే 6 కోట్లకు పైగా వీక్షించారు. 15 లక్షలకు పైగా వీక్షకులు ఈ పోస్ట్‌ను లైక్ చేశారు. ట్రాన్స్‌జెండర్ అందాన్ని ప్రశంసల వర్షం గుప్పిస్తున్నారు. మీరు తప్పు వృత్తిలోకి ప్రవేశించారు, మీరు భోజ్‌పురి సినిమా హీరోయిన్ లాగా ఉన్నారు అంటూ ఒక యూజర్‌ పోస్టు పెట్టారు. నా మాజీ కంటే చాలా అందంగా ఉన్నారని కూడా అన్నారని మరొక యూజర్‌ కామెంట్‌ చేశారు. ఆమె ఎంత అందంగా ఉందో ట్రాన్స్‌జెండర్‌ అంటే నమ్మలేకపోతున్నాం అంటూ అనేక మంది పోస్టులు పెట్టారు.