Viral Video: తెలుగు కట్టుబొట్టుకు ప్యారిస్‌ ప్రజలు ఫిదా… మెట్రో రైల్లో దేవకన్యలా మెరిసిన నివ్య

చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది...అంటూ సినీ కవులు వర్ణించినట్లుగా చీరకట్టుతో ఆడవారు మరింత అందంగా కనిపిస్తారు. చీరకట్టు భారతీయ సంస్కృతీ సంప్రదాయానికి చిరునామాగా చెబుతారు. విదేశీయులు సైతం చీరకట్టుకుని సంబరపడిపోతుంటారు. అనేక మంది ఫేమస్‌ మోడల్స్‌ కూడా చీర కట్టును తమ ఫ్యాషన్‌ షోలల్లో...

Viral Video: తెలుగు కట్టుబొట్టుకు ప్యారిస్‌ ప్రజలు ఫిదా... మెట్రో రైల్లో దేవకన్యలా మెరిసిన నివ్య
Lehanga In Paris Metro Trai

Updated on: May 21, 2025 | 4:29 PM

చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది…అంటూ సినీ కవులు వర్ణించినట్లుగా చీరకట్టుతో ఆడవారు మరింత అందంగా కనిపిస్తారు. చీరకట్టు భారతీయ సంస్కృతీ సంప్రదాయానికి చిరునామాగా చెబుతారు. విదేశీయులు సైతం చీరకట్టుకుని సంబరపడిపోతుంటారు. అనేక మంది ఫేమస్‌ మోడల్స్‌ కూడా చీర కట్టును తమ ఫ్యాషన్‌ షోలల్లో ప్రదర్శిస్తుండటంతో చీరకు ఇంటర్నేషనల్‌ లేవల్లో ప్రాముఖ్యత లభించింది. ఇలాంటి సంఘటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువతి లెహంగా ధరించి ప్యారిస్ మెట్రోలో ప్రయాణించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

నివ్య అనే యువతి.. భారతీయ సాంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్యారిస్‌లో రీల్స్‌ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఆమె అందమైన లెహెంగా ధరించి చేసిన వీడియో సోషల్ మీడియా జనాలు ఫిదా చేస్తోంది. ఆరెంజ్‌, గోల్డ్ కలర్‌‌ ఎంబ్రాయిడరీతో కూడిన అందమైన లెహంగా ధరించిన నివ్య.. ప్యారిస్ లోకల్ రైల్లో జర్నీ చేసింది. అందంగా ముస్తాబైన ఆమె.. స్టేషన్‌లోకి అడుగుపెట్టిన సీన్‌కు నెటిజన్స్‌ వావ్‌ అంటున్నారు.

ప్రవేశ ద్వారం దగ్గర నుంచి రైల్లోకి వెళ్లే వరకూ ఆమె నడక, వ్యవహార శైలి అక్కడున్న వారందరినీ కంటి మీద రెప్ప వాల్చకుండా చేసింది. రైలు ఎక్కిన తర్వాత కళ్లద్దాలను ధరించడంతో ఆమె అందం మరింత రెట్టింపయింది. రైల్లో ఉన్న వారయితే చూపు తిప్పుకోలేకపోయారు. లెహంగాతో పాటూ ఒంటిపై వివిధ రకాల ఆభరణాలు ధరించి, అచ్చమైన తెలుగమ్మాయిలా దర్శనమిచ్చింది.

నివ్య అందానికి ప్యారిస్ ప్రజలతో పాటూ నెటిజన్లు పడిపోయారు. ప్యారిస్‌ ప్రజలకు భారతీయ సాంప్రదాయాలను గుర్తు చేయడం ఎంతో గొప్ప విషయం అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు.

వీడియో చూడండి: