Viral Video: ఆగిపోవాల్సిన పెళ్లిని నిలబెట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. అంతా ఫిదా.. అసలు ఏం జరిగిందంటే..?

పెళ్లి తంతు ముగింపు దశకు వచ్చింది.. వరుడు వధువు నుదుట సింధూరం దిద్దాలి. సరిగ్గా అదే సమయంలో కుటుంబసభ్యులు అది తీసుకరావడం మర్చిపోయారు. బయట చూస్తే ఫుల్ ట్రాఫిక్. దీంతో కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఆ తర్వాత ఏం జరిగింది..? చివరకు జరిగిన ఆ ఆసక్తికర మలుపు ఏంటీ అన్నది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

Viral Video: ఆగిపోవాల్సిన పెళ్లిని నిలబెట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. అంతా ఫిదా.. అసలు ఏం జరిగిందంటే..?
Blinkit Delivery Saved A Couple Wedding

Updated on: Dec 29, 2025 | 2:03 PM

నేటి కాలంలో ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లు మన జీవితంలో ఎంతగా భాగమైపోయాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. నిత్యావసరాలు, కూరగాయలే కాదు.. ఏకంగా ఆగిపోవాల్సిన పెళ్లిని కూడా ఇవి సజావుగా సాగేలా చేస్తున్నాయి. ఢిల్లీలో జరిగిన ఒక వివాహ వేడుకలో సింధూరం మర్చిపోవడంతో ఏర్పడిన ఉత్కంఠను బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ తన వేగంతో తెరదించాడు. ఢిల్లీకి చెందిన పూజా, హృషి అనే జంట వివాహం ఘనంగా జరుగుతోంది. వేద మంత్రాల మధ్య సప్తపది కూడా పూర్తయింది. ఇక చివరగా వధువు నుదుట వరుడు సిందూరం దిద్దాల్సిన సమయం వచ్చింది. సరిగ్గా అదే సమయంలో పెళ్లిలో అసలైన ట్విస్ట్ ఎదురైంది. పూజా కార్యక్రమాల హడావిడిలో అత్యంత ముఖ్యమైన సింధూరం ప్యాకెట్ తీసుకురావడమే అందరూ మర్చిపోయారు. ముహుర్తం సమయం దాటిపోతుండటం, బయటకు వెళ్లి తీసుకురావాలంటే ట్రాఫిక్ వల్ల ఆలస్యం అవుతుందని ఆందోళన చెందుతున్న సమయంలో వధువు కుటుంబ సభ్యులకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే ఫోన్ తీసి బ్లింకిట్ యాప్‌లో సిందూరం ఆర్డర్ చేశారు.

16 నిమిషాల్లో చేతికి.. సభలో చప్పట్లు!

ఆర్డర్ చేసిన కేవలం 16 నిమిషాల వ్యవధిలోనే బ్లింకిట్ డెలివరీ పార్ట్‌నర్ నేరుగా కళ్యాణ మండపం వద్దకు చేరుకున్నారు. డెలివరీ ఏజెంట్ రాగానే అతిథులందరూ హర్షధ్వానాలు చేస్తూ చప్పట్లు కొట్టారు. ఆ సింధూరాన్ని తీసుకుని వరుడు పెళ్లి తంతును విజయవంతంగా ముగించాడు. ఈ అద్భుత దృశ్యాన్ని వధువు స్నేహితులు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. బ్లింకిట్ డెలివరీ బాయ్ ఈ పెళ్లికి సైలెంట్ సూపర్ హీరో అని కొందరు ప్రశంసిస్తుంటే..ఒకవేళ డెస్టినేషన్ వెడ్డింగ్ అయ్యుంటే పరిస్థితి ఏంటి?, మన దగ్గర క్విక్ కామర్స్ యాప్స్ ఉండటం అదృష్టం అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. గుజరాత్‌లో కూడా ఒక పెళ్లిలో ఇలాగే తాళిబొట్టుకు సంబంధించిన వస్తువులను బ్లింకిట్ ద్వారా తెప్పించుకున్నామని ఓ నెటిజన్ తన అనుభవాన్ని పంచుకున్నారు. సాంప్రదాయ ఆచారాలు, ఆధునిక సాంకేతికత కలిస్తే ఎంతటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించవచ్చని ఈ ఘటన నిరూపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది.