
మనలో చాలా మంది పులిని చూసినా భయపడరేమో గానీ, పామును చూస్తే మాత్రం ఎంత పెద్ద ధైర్యవంతుడికైనా వణుకు పుడుతుంది. అక్కడ పాము ఉందంటే ఇక్కడి నుంచే భయంతో జారుకుంటారు. చిన్న పాములను చూస్తేనే జడుసుకునే జనం.. ఇక, కొండచిలువలు, ఆనకొండలు వంటి వంటి పెద్ద పాములు కనిపిస్తే మాత్రం ఆ భయం ఎలా ఉంటుందో వర్ణనాతీతం. ఇక ఆనకొండ పాములయితే మనుషులను సైతం ఆవలీలగా మింగేస్తున్న దృశ్యాలు సినిమాల్లో కనిపిస్తుంటాయి. ఆ దృశ్యాలు చూసిన వారికెవరికైనా ఆనకొండ పేరు వింటేనే గుండె ఆగినంత పనవుతది. ఈ భూమి మీదే అతిపెద్ద అనకొండను కొన్ని రోజుల క్రితం ఈక్వెడార్‌లో గుర్తించారు. తాజాగా అమెజాన్ అడవుల్లో మరో భారీ అనకొండ టూరిస్టుల కళ్లపడింది.
అయితే ఒక్క ఆనకొండను చూస్తేనే ప్రాణాలు పోయినంత భయం పుట్టుకొస్తుంది. అలాంటిది డజన్ల కొద్దీ ఆనకొండలు కనిపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఊహల్లో కూడా భయం వేస్తుంది కదా.. యస్.. మీరు భయపడుతున్నట్లుగానే ఆనకొండలతో నిండిన ఓ నది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హెలికాఫ్టర్‌లో వెళ్తూ నదిలో దృశ్యాన్ని షూట్ చేసినట్టు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంటుంది. అమెజాన్ అడవుల మధ్యలో నుంచి ప్రవహించే ఓ నదిలో డజన్ల కొద్దీ అనకొండలు ఈత కొడుతున్నట్టు ఆ వీడియోలోని దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ఆ వీడియో చూసిన వారందరూ ఇప్పుడు భయంతో షేక్ అవుతున్నారు. ఆ వీడియో నిజమేనా అంటే అది నిజమైనది కాదని తెలుస్తోంది.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చాక ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టించడంలో సాధ్యం అవుతోంది. అంతా ఏఐ మాయ. ఈ వీడియో కూడా ఏఐని ఉపయోగించి తాయారు చేసిందే. సోషల్ మీడియాలో తెర వైరల్ అవుతోంది. లక్షల మంది నెటజన్స్ ఆ వీడియోను వీక్షించారు. ఒకేసారి డజన్ల కొద్దీ ఆనకొండలను చూసిన నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కృత్రిమ మేధస్సుతో తయారు చేసినప్పటికీ నిజమైన వీడియో లెక్కనే ఉందని పోస్టులు పెడుతున్నారు. ఇక ఆ నదిలో పడితే మాత్రం ప్రాణాలతో తిరిగి రారు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
😲🥺Helicopter view of anaconda river,.
A scary view..
Nothing comes out alive here. pic.twitter.com/ObKfR1Untk— SÈYE (@official_Sheye) May 14, 2025