First Birthday: చిన్నారికి గుర్తిండిపోయేలా పుట్టిన రోజు వేడుక .. ఆకాశంలో బర్త్ డే సెలబ్రేషన్..

|

Jul 23, 2023 | 6:26 PM

ఆ చిన్నారి పాప మొదటి పుట్టిన రోజు అని తెలిసి, విమానంలోనే వేడుకలను నిర్వహించింది. దాంతో ప్రయాణికులంతా చప్పట్లతో బేబీకి శుభాకాంక్షలు తెలియజేశారు.  తమ సంతోషాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను చిన్నారి తండ్రి జోయెల్‌ లాల్‌ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

First Birthday: చిన్నారికి గుర్తిండిపోయేలా పుట్టిన రోజు వేడుక .. ఆకాశంలో బర్త్ డే సెలబ్రేషన్..
First Birthday
Follow us on

ఓ చిన్నారి తన పుట్టిన రోజు వేడుకను ఆకాశంలో సెలబ్రేట్‌ చేసకుంది. అవును వినడానికి ఇది వింతగా ఉన్నా నిజం. ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి పాపకు, ఆమె తల్లిదండ్రులకు సదరు విమానయాన సంస్థ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఆరోజు ఆ చిన్నారి పాప మొదటి పుట్టిన రోజు అని తెలిసి, విమానంలోనే వేడుకలను నిర్వహించింది. దాంతో ప్రయాణికులంతా చప్పట్లతో బేబీకి శుభాకాంక్షలు తెలియజేశారు.  తమ సంతోషాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను చిన్నారి తండ్రి జోయెల్‌ లాల్‌ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న బ్యూలా లాల్‌ అనే పాప మొదటి పుట్టిన రోజని సిబ్బందికి తెలిసింది. దాంతో కెప్టెన్‌ వెంటనే మైక్‌ అందుకుని, లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌, దయచేసి వినండి నేను మీ కెప్టెన్‌ అగస్టీన్. ఇప్పుడు అది ముఖ్యం కాదు. నేను ఇప్పుడు మీకు చెప్పే ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే..  మనతో పాటు ఓ చిన్నారి ప్రయాణిస్తుంది. ఈ రోజు ఆ పాప ఫస్ట్ బర్త్ డే.. కనుక మనం అందరం ఆ పాప పుట్టిన రోజు వేడుకలను విమానంలో సెలబ్రేట్ చేసుకుంటున్నాం.. అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

 

అందుకే కేక్‌ కట్‌ చేస్తున్నాం. అందరికీ పంచిపెడతాం ఎనౌన్స్‌ చేశాడు. దాంతో విమానంలోని ప్రయాణికులంతా పాపకు అభినందనలు తెలిపారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోకి నెటిజన్లు విశేషంగా స్పందించారు. దాదాపు 10 లక్షల మంది వీడియోను వీక్షించారు. ఈ వీడియోలో ఆ అనంద క్షణాలను పంచుకోవడం చాలా బాగుందని, చిన్నారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ కామెంట్‌ చేశారు. కాగా కేరళలోని కొచ్చి విమానంలో దిగగానే పాపతో ఇండిగో సిబ్బంది చాక్లెట్ కేక్‌ కట్ చేయించారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..