Viral Video: ట్రాలీ నుంచి కిందపడబోయాడు.. కానీ కారు డ్రైవర్ దేవుడిలా వచ్చాడు..!

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇందులో రకరకాల వీడియోలు ఉంటాయి. అయితే సహాయానికి సంబంధించిన వీడియోలు

Viral Video: ట్రాలీ నుంచి కిందపడబోయాడు.. కానీ కారు డ్రైవర్ దేవుడిలా వచ్చాడు..!
Trolley Incident

Updated on: Apr 08, 2022 | 4:27 PM

Viral Video: సోషల్‌ మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. ఇందులో రకరకాల వీడియోలు ఉంటాయి. అయితే సహాయానికి సంబంధించిన వీడియోలు నెటిజన్ల మనసుని దోచుకుంటాయి. ఇలాంటి వీడియోలు తరచుగా వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ట్రాలీ నుంచి పడిపోతున్న ఒక వ్యక్తిని ఓ కారు డ్రైవర్ కాపాడుతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కామెంట్స్‌, లైక్స్‌తో హోరెత్తిస్తు్న్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి ట్రాలీలో నిలుచొని ఏదో ఒక పనిచేయడం మనం వీడియోలో గమనించవచ్చు. ఈ క్రమంలో ఒక్కసారిగా అదుపతప్పి ట్రాలీ నుంచి కిందపడబోతాడు. ఈ క్రమంలో రెండు చేతులతో ట్రాలీ డోరుని గట్టిగా పట్టుకొని వేలాడుతుండటం మనం వీడియోలో చూడవచ్చు.

సరిగ్గా అదే సమయానికి ఒక కారు డ్రైవర్ అదే రహదారి గుండా వస్తాడు. ట్రాలీలో ఉన్న వ్యక్తి పరిస్థితిని గమనించి నెమ్మదిగా కారుని ముందుకు నడిపిస్తాడు. దీంతో కారు విండోలనుంచి అతడికి బ్యాక్‌ సపోట్‌ అందిస్తాడు. దీంతో అతడు మళ్లీ అతడు ట్రాలీలోకి వెళ్లిపోతాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు కారు డ్రైవర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తు్నారు. ఈ వీడియోను ఐపీఎస్ దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీంతో పాటు ‘ఒకరికి సహాయం చేసే అవకాశాన్ని పొందడం దేవుని ఆశీర్వాదం అని క్యాప్షన్‌లో రాశాడు. మీకు ఇలాంటి అవకాశం దొరికినప్పుడల్లా సహాయం చేయండని పిలుపునిచ్చాడు. కొన్ని గంటల క్రితం షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 24 వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు నిరంతరం తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.

Kitchen vastu: వంటగది వాస్తు నియమాలు.. కచ్చితంగా పాటించాలి లేదంటే చాలా అనర్థాలు..!

IPL 2022: రిషబ్‌ పంత్‌ ఆటతీరుపై తీవ్ర విమర్శలు.. కెప్టెన్ అయ్యాక విఫలమవుతున్నాడు..!

Viral Video: పెళ్లి కొడుకు స్నేహితుడే డబ్బులు నొక్కేస్తున్నాడు.. వీడియో చూస్తే షాక్..!