Viral Video: అయ్యయ్యో లక్షల ఖరీదైన కారు.. తుక్కు తుక్కు చేసిన సెక్యూరిటీ గార్డ్స్‌.. షాకింగ్‌ వీడియో వైరల్

సోషల్ మీడియాలో ఒక షాకింగ్‌ వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో ఒక సెక్యూరిటీ గార్డు ఖరీదైన మెర్సిడెస్‌ కారుపై తన కోపాన్ని ప్రదర్శించాడు. గేటు వద్ద ఆగి ఉన్న మెర్సిడెస్ కారుపై కోపంతో దాన్ని పగులగొట్టాడు. చేతిలో ఉన్న కర్రతో కారును పగలకొడతున్న దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. దాని వెనుక గల కారణం ఏంటో పూర్తి డిటెల్స్‌లోకి వెళితే..

Viral Video: అయ్యయ్యో లక్షల ఖరీదైన కారు.. తుక్కు తుక్కు చేసిన సెక్యూరిటీ గార్డ్స్‌.. షాకింగ్‌ వీడియో వైరల్
Guards Smash Mercedes'

Updated on: Dec 25, 2025 | 8:01 AM

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ వీడియో గురుగ్రామ్ నుండి వచ్చినట్లుగా తెలిసింది. ఈ వీడియోలో ఒక సెక్యూరిటీ గార్డు గేటు వద్ద పార్క్ చేసిన మెర్సిడెస్ కారు అద్దాలను కర్రతో పగులగొట్టడం కనిపిస్తుంది. కాగా, కారు యజమాని ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం. కానీ ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మెర్సిడెస్ కారు డ్రైవర్ రాంగ్‌రూట్‌లో కారు నడపడం వల్లే ఈ సంఘటన జరిగింది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 31లోని సైబర్ పార్క్ వద్ద సెక్యూరిటీ గార్డులు అతన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే కారు డ్రైవర్‌, సెక్యూరిటీ గార్డుకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే డ్రైవర్ గార్డులపై దాడి చేశాడు. ప్రతీకారంగా, భద్రతా సిబ్బంది కారును ధ్వంసం చేశారు. దీని విలువ దాదాపు 50 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.

ఇవి కూడా చదవండి

వీడియోలో గార్డు మరొక వ్యక్తి నుండి కర్రను లాక్కొని కారు వైపు పరిగెత్తి, కిటికీలను పగలగొట్టాడు. మరొక వ్యక్తి కారు టెయిల్ లైట్లు, సైడ్ మిర్రర్లను పగలగొట్టడం కనిపిస్తుంది. ఈ సంఘటనతో అక్కడ ఉన్నవారు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ, అప్పటికే కారు చాలా వరకు దెబ్బతింది. అయితే, ఈ గొడవను ఎవరు ప్రారంభించారు. భద్రతా దళాలకు అలాంటి చర్య తీసుకునే అధికారం ఉందా..?అనేది చాలా మంది వ్యక్తం చేస్తున్న సందేహం.

కాగా, ఈ ఘటనపై కారు యజమాని ఇంకా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. పోలీసుల నుండి కూడా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఈ వీడియో విస్తృత చర్చకు దారితీసింది. ఈ సంఘటనపై సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు గార్డు ప్రవర్తనను ఖండిస్తున్నారు. మరికొందరు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ఘర్షణకు కారణమని ఆరోపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..