
పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. పెళ్లి కొడుకు కత్తి తిప్పడాలు.. వరుడు వధువు కలిసి డ్యాన్స్ చేయడాలు వంటి వీడియోలు దర్శనమిస్తుంటాయి. వాటి కొన్ని ఫన్నీగా ఉండి త్వరగా వైరల్ అవుతుంటాయి. అలాంటి అసక్తికర వీడియోనే ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. సాధరణంగా పెళ్లి కొడుకు ఎంతో హూందాగా, డాబు దర్పంగా కనిపిస్తాడు. వధువు ముందు ఎంతో ధైర్యవంతుడిగా ఫోజు కొడుతుంటాడు. కానీ ఇక్కడ జరిగిన ఓ సంఘటనలో పెళ్లికొడుకు పిరికి బయటపడిపోయింది. ఈ వీడియో చేసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు.
వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పెళ్లి జరుగుతోంది. వేదికపై వధూవరుల వరమాల కార్యక్రమ వేడుక బంధు మిత్రుల మధ్య అట్టాహాసంగా నిర్వహిస్తున్నారు. వరుడి మెడలో వధువు దండ వేసింది. ఆ తర్వాత వధువు మెడలో వరుడు దండ వేస్తుండగా ఓ షాకింగ్ సంఘటన జరిగింది. వరుడి పక్కనే భారీ శబ్దంతో పటాక్ పేలింది. ఒక్కసారిగా భయపడిన వరుడు పక్కకు పడిపోయినంత పని చేశాడు. వెంటనే ఎవడ్రా ఇక్కడ పటాక్ కాల్చింది అంటూ కోప్పడటం వీడియోలో కనిపిస్తుంది. చుట్టూ ఉన్న వారు వరుడి కోపాన్ని చల్లార్చారు. అనంతరం వధువు మెడలో పై దండ వేయించారు. అయితే పటాక్ పేలిన దగ్గరే వధువు కూడా ఉంది.కానీ, ఆమె మాత్రి కించిత్ కూడా జంకకపోవడం విశేషం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 8 లక్షల మంది వీక్షించారు. వేల మందికి లైక్ చేశారు. నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. పాపం.. అతడిని ప్రశాంతంగా పెళ్లి చేసుకోనివ్వడయా అంటూ పోస్టులు పెడుతున్నారు.