AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: నువ్వు దేవుడివి సామి.. ‘రెక్క మార్పిడి’తో సీతాకోకచిలుకకు పునర్జన్మ..

వైద్య శాస్త్రం మరో అద్భుతం చోటు చేసుకుంది. రెక్కలు తెగి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సీతాకోక చిలుకకు ప్రాణం పోశారు. లాంగ్ ఐలాండ్‌లోని స్వీట్‌బ్రియర్ నేచర్ సెంటర్‌లోని మోనార్క్ సీతాకోకచిలుక గాయపడింది. ఆ సీతాకోకచిలుకకు సున్నితమైన రెక్క మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. దీంతో అది మళ్ళీ ఎగరగలిగే సామర్థ్యం సంపాదించుకుంది.

Video: నువ్వు దేవుడివి సామి.. 'రెక్క మార్పిడి'తో సీతాకోకచిలుకకు పునర్జన్మ..
Butterfly Wing Transplant
Balaraju Goud
|

Updated on: Oct 09, 2025 | 4:20 PM

Share

వైద్య శాస్త్రం మరో అద్భుతం చోటు చేసుకుంది. రెక్కలు తెగి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సీతాకోక చిలుకకు ప్రాణం పోశారు. లాంగ్ ఐలాండ్‌లోని స్వీట్‌బ్రియర్ నేచర్ సెంటర్‌లోని మోనార్క్ సీతాకోకచిలుక గాయపడింది. ఆ సీతాకోకచిలుకకు సున్నితమైన రెక్క మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. దీంతో అది మళ్ళీ ఎగరగలిగే సామర్థ్యం సంపాదించుకుంది. ఈ అరుదైన ప్రక్రియకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా నెటిజన్ల హృదయాలను తాకింది.

రెక్క విరిగిన సీతాకోకచిలుక ఎగరలేకపోయింది. అది బతికేది కాదు. అప్పుడే పక్షుల సంరక్షకులు చనిపోయిన సీతాకోకచిలుక రెక్కను ఉపయోగించి ఇంతకు ముందు ఎప్పుడూ వినని రెక్క మార్పిడి శస్త్రచికిత్సను ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారు. “చనిపోయిన సీతాకోకచిలుక రెక్కను ఉపయోగించి, మేము దానిని విరిగిన రెక్కకు జాగ్రత్తగా సరిపోల్చాము. సున్నితమైన చికిత్స చేశాము” అని స్వీట్‌బ్రియర్ నేచర్ సెంటర్‌ నిర్వహకులు తెలిపారు. ఫలితంగా ఆ మోనార్క్ సీతాకోకచిలుక ప్రత్యామ్నాయ రెక్కతో ఎగురుతూ వెళ్లిపోయింది.

వీడియో చూడండి:

రెక్క మార్పిడి పూర్తయిన తర్వాత, సీతాకోకచిలుక తన రెక్కలను విప్పి మళ్ళీ ఎగిరిపోవడాన్ని సంరక్షకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “అది ఎగరడం చూడటం కళ్ళలో నీళ్ళు తెప్పించింది. ఈ చిన్న ప్రాణికి ఇప్పుడు జీవితంలో రెండవ అవకాశం దక్కింది. దాని అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది” అని పక్షి సంరక్షకులలో ఒకరు తెలిపారు. ఈ సీతాకోకచిలుకలు మెక్సికో, పశ్చిమ యుఎస్‌లోని శీతాకాలపు ప్రదేశాలకు వేల మైళ్లు ప్రయాణిస్తాయి.

మోనార్క్ సీతాకోకచిలుకలు ఉత్తర అమెరికా అంతటా వేల మైళ్ళు ప్రయాణించి సుదూర ప్రాంతాలకు వలస వెళ్తాయి. మోనార్క్ వలస ప్రకృతిలో గొప్ప రహస్యాలలో ఒకటి. ఈ సీతాకోకచిలుకలు ఇంతకు ముందు ఎన్నడూ లేని ప్రదేశాలకు వేల మైళ్ళు ప్రయాణిస్తాయి. సూర్యుని స్థానం, భూమి అయస్కాంత క్షేత్రం, ఇతర సహజ సంకేతాలను ఉపయోగించి అవి తమ మార్గాన్ని కనుగొంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆ వీడియో ఆన్‌లైన్‌లో లక్షలాది మంది దృష్టిని ఆకర్షించింది. వీక్షకులు రక్షకుల అంకితభావం, సృజనాత్మకతకు ప్రశంసలు కురిపించారు. ఒక వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు, “మీరందరూ అత్యుత్తమ మానవులు.” మరొక వినియోగదారు.. “ఇది సాధ్యమేనని నేను నమ్మలేకపోతున్నాను! ఆశ్చర్యంగా ఉంది!” అన్నారు. ఒక వినియోగదారు..”చిన్న వాటిని కూడా మీరు జీవితానికి విలువ ఇస్తారని నేను ఇష్టపడుతున్నాను. ఒక చిన్న కీటకాన్ని చంపడం కూడా నాకు కష్టం. ఎందుకంటే మీరు ఈ సీతాకోకచిలుకకు రెండవ అవకాశం ఇచ్చిన జీవితాన్ని ఎంతో అద్భుతంగా చూస్తున్నానని అనిపిస్తుంది.” అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..