Viral Video: మనుషులను మించిపోయిన గజదొంగలు.. కుమ్మక్కై దోచేస్తున్న కుక్క, కోడి.. ఫన్నీ వీడియో..
Viral Video: సోషల్ మీడియా షేరింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే ఒక కుగ్రామంలా మారిపోయింది. ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది
Viral Video: సోషల్ మీడియా షేరింగ్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచమే ఒక కుగ్రామంలా మారిపోయింది. ఏ మూలన ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది ప్రపంచానికి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు అయితే ప్రజలు తెగ ఆకట్టుకుంటున్నాయి. అందకే 100 మంది సగం మంది ఎప్పుడూ ఆ వీడియోలను చూసేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తుంటారు. తాజాగా ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియోను చూసి తెగ నవ్వేసుకుంటున్నారు జనాలు. ఈ జంతువులు ఇలా తెలివిమీరితే ప్రజల మనుగడ కష్టమేనని అనుకుంటున్నారు.
ఎలా కలిశాయో గానీ.. కుక్క, కోడి మధ్య బలమైన స్నేహబంధం ఏర్పడింది. ఆ స్నేహం ఎంతలా అంటే.. ఏపని చేసినా రెండూ కలిసే చేస్తున్నాయి. ఒకదాన్ని విడిచి మరొకటి అస్సలు ఉండటం లేదు. అయితే, వీటికి బాగా ఆకలేసిందో ఏమో గానీ.. రెండూ కలిసి ఓ భారీ చోరీ చేశాయి. చాలా తెలివిగా దొంగిలించాయి. ఇంట్లో సెల్ఫ్‌పై ఆహార పదార్థాలు పెట్టగా.. కుక్క, కోడి రెండూ కలిసి వచ్చాయి. కోడికి ఆ ఆహారం అందకపోవడంతో.. కుక్క పైకి ఎక్కింది. దాంతో పని ఈజీ అయ్యింది. నోటికి అందినకాడికి కుమ్మేసింది. అయితే, ఈ క్యూట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఆ రెండూ కలిసి పనికి అందరూ నవ్వుకుంటున్నారు. మరెందుకు ఈ ఆలస్యం ఈ చోరీ కుక్క, కోడిని చూసేయండి.
تعاون متبادل بين كلب ودجاجة ! pic.twitter.com/YZF5d0XJZm
— عالم الغابة (@22forest22) June 21, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..