Viral Video: ఆపదలో ప్రాణాలు కాపాడుకోవాలంటే మన వంతు ప్రయత్నం చేయాలి.. ఈ భారీ ఏనుగు చేసిన పని చూస్తే ముక్కున వెలేసుకుంటారు!

|

Mar 26, 2022 | 4:10 PM

Viral Video: దట్టమైన అడవుల్లో ఉండే జంతువులు(Wild Animals) తరచుగా అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి. బురద గుంటలో పడి జంతువులు అందులో చిక్కుకుని ప్రాణాపాయానికి..

Viral Video: ఆపదలో ప్రాణాలు కాపాడుకోవాలంటే మన వంతు ప్రయత్నం చేయాలి.. ఈ భారీ ఏనుగు చేసిన పని చూస్తే ముక్కున వెలేసుకుంటారు!
Forest Staff Helps Rescue H
Follow us on

Viral Video: దట్టమైన అడవుల్లో ఉండే జంతువులు(Wild Animals) తరచుగా అనేక ఇబ్బందులకు గురవుతూ ఉంటాయి. బురద గుంటలో (stuck in swamp) పడి జంతువులు అందులో చిక్కుకుని ప్రాణాపాయానికి గురవుతుంటాయి. అలాంటి సమయంలో తమను బయటకు తీసే వ్యక్తుల సహాయం కోసం ఎదురుచూస్తుంటాయి. తాజాగా ఓ భారీ ఏనుగు దట్టమైన అడవిలోని బురద గుంటలో చిక్కుకుంది. అయితే వెంటనే అటవీ సిబ్బంది ఏనుగును ఆ బుదర నీటి నుంచి బయటకు తీశారు. సకాలంలో రక్షించారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.

ఓ భారీ ఏనుగు నీలగిరిలోని గూడలూర్‌లోని చిత్తడి నేలలో చిక్కుకుపోయింది. అయితే భారీ ఏనుగు అవ్వడంతో తాను తానుగా ఆ బురద గుంట నుంచి బయటకు రాలేక పోయింది. అయితే ఆ ఏనుగు  బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు. అది చిత్తడిలో పడిపోతూనే ఉంది. ఈ విషయం గమనించిన అటవీ శాఖ సిబ్బంది ఈ భారీ ఏనుగును బురద నుంచి బయటకు రావడానికి సహాయం చేశారు. ఓ తాడు సాయంతో ఏనుగును బయటకు తీసుకుని రావడనికి ప్రయత్నిస్తున్న సమయంలో ఏనుగు కూడా తానూ ఆ సిబ్బందికి తన వంతు సహాయం అందించింది. తనను బయటకు లాగుతున్నప్పుడు తాడుని పట్టుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించింది.

ఈ వీడియోని నీలగిరికి మానిటరింగ్ ఆఫీసర్‌ సుప్రియా సాహు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 25 ఏళ్ల ఏనుగు తనను తాను రక్షించుకోవడానికి ఉత్తమ పోరాట ప్రటిమ కనబరిచిందని ఆ వీడియోకి ఓ క్యాప్షన్ కూడా జతచేశారు. “ఏనుగు.. తనను రక్షించడానికి విసిరిన తాడును పట్టుకొని చిత్తడి నుండి బయటపడటానికి ఆదర్శప్రాయమైన పోరాట శక్తిని చూపించింది.”

వీడియో వైరల్ కావడంతో ప్రజలు అటవీ శాఖ సత్వర చర్యను అభినందించారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జంతువులకు సహాయం చేయడానికి ఈ చిత్తడి నేలల చుట్టూ మెట్లు లేదా ర్యాంపులను నిర్మించాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

 

Also Read: Vastu Tips: తీసుకున్న అప్పులు తీరడం లేదా.. అయితే ఈ వాస్తు దోషాలు ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి

Yogi Adityanath: రెండో సారి రాష్ట్ర పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌ తొలి కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలు ఇవే..!