
నేటి సోషల్ మీడియా యుగంలో కొత్త ఉత్పత్తులను ట్రై చేయడం ఒక ట్రెండ్‌గా మారింది. అయితే, కొన్నిసార్లు ఈ ప్రయత్నాలు చాలా వింతగా ఉంటాయి. వాటిని చూసినవారు షాక్ అవుతుంటారు. ప్రస్తుతం, అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో ఒక అమ్మాయి ఖరీదైన మాయిశ్చరైజర్ గురించి ఇచ్చిన సమాచారంపై ఆమె తండ్రి స్పందన చూసి నెటిజన్లు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక అమ్మాయి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఒక మాయిశ్చరైజర్ గురించి చెబుతోంది. ఆ ట్రెండ్‌ను అనుసరించడానికే తాను ఆ మాయిశ్చరైజర్‌ని ఆర్డర్ చేశానని చెప్పింది. ఒక చిన్న కంటైనర్ ధర రూ. 5,800 అని ఆమె తన తండ్రికి చెప్పినప్పుడు, అతను షాక్ అయ్యాడు. ఆ షాక్‌లోనే అతడు తన భార్యతో ఇలా అంటున్నాడు.. చూడు నీ కూతురు డబ్బును ఎలా వృధా చేస్తుందో! అంటూ మండిపడ్డాడు. దానికి అతని కూతురు నేను ఇది నా ముఖం మీద వేసుకుంటాను అంటూ జవాబిచ్చింది. ఆ సరదా అక్కడితో ముగియలేదు. తరువాత వీడియోలో కూతురు తండ్రికు మరో షాకిస్తూ ఇంకో విషయాన్ని బయటపెట్టింది. ఈ మాయిశ్చరైజర్‌లో పిల్లి మలం ఉందంటూ చెప్పింది. ఇది విన్న తండ్రికి మరో మైండ్ బ్లాంక్ అయినట్టుగా అనిపించింది. పైగా ఆమె తన మాయిశ్చరైజర్ వాసన చూడమని తండ్రిని అడిగినప్పుడు, కోపంతో రగిలిపోతున్న ఆ తండ్రి..కొన్ని రోజులు నా నుండి దూరంగా ఉండు అంటూ ఆగ్రహించుకుంటాడు.
వీడియో ఇక్కడ చూడండి..
5800 rs का p0op 0f Cat है, वो छोड़ो…
भाई मैं तो जीवन में कभी हाथ का पानी ना पियूं…!
🥴🥴😓 pic.twitter.com/5kSdQdqrIE— ताज़ा तमाचा (@Taza_Tamacha) January 13, 2026
ఈ వీడియోను X ప్లాట్‌ఫామ్‌లో @Taza_Tamacha అనే ఖాతా ద్వారా షేర్ చేశారు . ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు ఫన్నీ వ్యాఖ్యలను కురిపించారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, ఇది మేకప్‌పై మేకప్ వేస్తున్నారు! అంటూ స్పందించాడు. మరొక వినియోగదారు తన కోపాన్ని వ్యక్తం చేస్తూ, బ్రదర్ర ఈ రోజుల్లో ఫ్యాషన్ పేరుతో అమ్మాయిలు పనికిరాని వస్తువులపై డబ్బు వృధా చేస్తున్నారు.. దానిలో ఎటువంటి సందేహం లేదంటూ పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…