Viral Video: మూడు చిరుతల మధ్య .. చిరుతను కౌగలించుకుని హాయిగా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్న వ్యక్తి

Viral Video: సర్వసాధారణంగా కౄర జంతువు (Wild Animal) లను చూస్తే చాలు భయంతో అల్లంత దూరానికి పరిగెడతారు. మరి అలాంటిది ఓ వ్యక్తి.. చిరుత (Cheetah) ల మధ్య హాయిగా ఒక వ్యక్తి..

Viral Video: మూడు చిరుతల మధ్య .. చిరుతను కౌగలించుకుని హాయిగా దుప్పటి కప్పుకుని నిద్రపోతున్న వ్యక్తి
The Cheetah Experience Vide

Updated on: Mar 24, 2022 | 7:09 PM

Viral Video: సర్వసాధారణంగా కౄర జంతువు (Wild Animal) లను చూస్తే చాలు భయంతో అల్లంత దూరానికి పరిగెడతారు. మరి అలాంటిది ఓ వ్యక్తి.. చిరుత (Cheetah) ల మధ్య హాయిగా ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు. మూడు చిరుతలు నిద్రపోతుంటే.. వాటి పక్కన దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నాడు. అప్పుడు ఒక చిరుత కుక్క పిల్లలా.. నిద్రపోతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి.. దుప్పటి కప్పుకుని అతని పక్కన నిద్రపోతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతుంది. నిజానికి ఈ వీడియో 2019 లో దక్షిణాఫ్రికాలోని బ్లూమ్‌ ఫోంటెయిన్‌లోని చిరుత పెంపకం కేంద్రంలో చిత్రీకరించారు. చిరుత పెంపకం కేంద్రంలో వాలంటీర్‌గా పనిచేసే డాల్ఫ్ వోల్కర్ అనుభవాన్ని వీడియో చూపిస్తుంది.

ఈ వీడియో దక్షిణాఫ్రికాలోని చిరుత పెంపకం కేంద్రమైన ‘ది చిరుత ఎక్స్‌పీరియన్స్’లో చేసిన వోల్కర్ ప్రయోగం. అతను మూడు చిరుతలతో కొన్ని రాత్రులు గడిపేందుకు ప్రత్యేక అనుమతి పొందాడు.

“చిరుతలు చల్లని కాంక్రీట్ లేదా వెచ్చని దుప్పట్లు, ఇతరులతో గడపడాన్ని ఇష్టపడతాయా? అనే అంశంపై దక్షిణాఫ్రికాలోని చిరుత పెంపకం  కేంద్రం పరిశీలించింది. ఈ మూడు చిరుతలు ఈ కేంద్రంలో పుట్టినవే. ఈ చిరుతలను సంతానోత్పత్తి కోసం మచ్చిక చేసుకున్నారు. కనుక ఈ చిరుతలు వాటి పిల్లలను నిశితంగా పరిశీలించవచ్చు. భవిష్యత్తులో ఈ చిరుతల్లో ఒకదానిని రక్షిత అడవిలోకి విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.

డాల్ఫ్ వోల్కర్ జంతు శాస్త్ర డిగ్రీ పట్టా పుచ్చుకున్నాడు. జంతు న్యాయవాది. జంతువుల ప్రవర్తనకు ఆకర్షితుడయ్యాడు. వాటిపై అధ్యయనం చేస్తాడు.