Viral Video: సమోసాని ఇప్పటికీ రూ.2.50 లకే అమ్ముతున్న వృద్ధుడు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో

|

Mar 02, 2022 | 8:42 AM

Viral Video: చిరు వ్యాపారులైనా, కార్పొరేట్ వ్యాపారస్తులైనా తమ బిజినెస్ ను లాభాల కోసం చేస్తారు. అయితే వీరిలో కూడా భిన్నమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులున్నారు.. తాము చేసే వ్యాపారాన్ని లాభాల దృష్టిలో ఆలోచించకుండా..

Viral Video: సమోసాని ఇప్పటికీ రూ.2.50 లకే అమ్ముతున్న వృద్ధుడు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో
Amritsar Vendor Sells Samos
Follow us on

Viral Video: చిరు వ్యాపారులైనా, కార్పొరేట్ వ్యాపారస్తులైనా తమ బిజినెస్ ను లాభాల కోసం చేస్తారు. అయితే వీరిలో కూడా భిన్నమైన ఆలోచనలు కలిగిన వ్యక్తులున్నారు.. తాము చేసే వ్యాపారాన్ని లాభాల దృష్టిలో ఆలోచించకుండా.. తాము బతకడం.. తోటివారి ఆకలిని తీర్చడం అన్న విధంగా అలోచించి.. నిజమైన దాతృత్వం , మానవత్వం ఉన్న మనుషులుగా పదిమంది మదిలో నిలిచిపోతారు. గత కొన్నేళ్లుగా సమోసాలు అమ్ముతున్న(Vendor Sells Samosas) వృద్ధుడి గురించి ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో హల్ చల్ చేస్తోంది.

సమోసాలు అమ్ముతున్న అమృత్‌ సర్ కి  చెందిన ఓ వీడియో ఒకటి ఫుడ్ బ్లాగర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.  హృదయాన్ని కదిలించే కథను ఫుడ్ బ్లాగర్ సరబ్జీత్ సింగ్ తన ‘mrsinghfoodhunter’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో 75 ఏళ్ల వృద్ధుడు.. పసుపు తలపాగా ధరించి.. ఎంతో ఇష్టంగా చిన్న చిన్న సమోసాలను తయారు చేస్తున్నాడు. అయితే ఎంతో రుచిగా శుచిగా తయారు చేస్తున్న ఈ సమోసాలను అతను కేవలం ఒక్కటి. రూ.2.50 లకే అమ్ముతున్నట్లు ఆ ఫుడ్ బ్లాగర్ పేర్కొన్నాడు.

ఆ వీడియోలోసరబ్ జీత్ సింగ్ స్ట్రీట్ ఫుడ్ సెల్లర్ గా తెలుస్తోంది. అంతేకాదు.. సమోసా తయారీకి సంబంధించిన వివిధ దశలు కూడా ఆ వీడియోలో చూపించడంతో వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. రుచికరమైన భారతీయ వంటకం సమోసాను రుచి చూడడానికి కస్టమర్స్ ఆసక్తిని చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ రీల్ 9.4 లక్షల వ్యూస్ ను సొంతం చేసుకుంది. అనేక మంది ఆ వృద్ధ వ్యాపారి దృక్పధాన్ని అభినందిస్తూ.. శుభాకాంక్షలు చెప్పారు.

అయితే ఒక నెటిజన్ ఈ వీడియో చూసి స్పందిస్తూ.. తనకు ఈ వ్యక్తి తెలుసు.. ఎందుకంటే తాను ప్రభుత్వ పాఠశాల మహనా సింగ్ రోడ్‌లో చదివినప్పుడు అతను సమోసా వ్యాపారాన్ని చేసేవాడు. అప్పుడు  ఆ సమయాన్నిసమోసాని కేవలం ఒక్క  1 రూపాయికి మాత్రమే అమ్మేవారు.. అయితే 11 సంవత్సరాల తర్వాత 2.5 రూపాయలకు అమ్ముతున్నారు.. ప్రస్తుతం అన్ని వ్యస్తువులు ధరలు చుక్కలను తాకుతున్నాయి.. అయినా లాభాపేక్ష లేకుండా వ్యాపారం చేస్తూ.. సమోసాలు అమ్ముతున్న మామయ్యకు నమస్కరిస్తున్నాను.. అప్పటి స్కూల్ రోజులు మళ్ళీ గుర్తికొచ్చాయి.. అంటూ   రచన సిరంజన్ అనే నెటిజన్ వ్యాఖ్యానించారు.

Also Read:

ఉక్రెయిన్‌లో ఆ గుర్తులున్న భవనాలపైనే ఎటాక్స్.. రష్యా రహస్యం అదేనా..?

ఆ శివాలయం మహత్యం ఇదే.. ప్రతి ఏడాది నాగుపాము ప్రత్యక్షం.. శివయ్యకు పూజలు