
ఇంటర్‌నెట్‌లో ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఇది ఒక డ్రోన్‌కి సంబంధించిన వీడియో.. ఇందులో ఒక వ్యక్తి డ్రోన్‌ను ఏర్పాటు చేసి, దానికి ఒక కోడిని తాడుతో కట్టేస్తాడు. ఆ తర్వాత డ్రోన్ స్టార్ట్ అవుతుంది. కోడి నెమ్మదిగా నేల నుండి పైకి లేస్తుంది. కొన్ని సెకన్లలో అది డ్రోన్‌తో పాటుగా ఆ కోడి కూడా ఆకాశంలోకి ఎగురుతుంది. ఇదంతా చూస్తూ కింద నిలబడి ఉన్న వ్యక్తులు నవ్వుతూ ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తున్నారు. గాల్లో డ్రోన్‌తో పాటు ఎగురుతున్న కోడి చూసి వారంతా ఎంజాయ్ చేస్తున్నారు.
వైరల్ క్లిప్ ఇప్పటికే మిలియన్ల వీక్షణలను సంపాదించింది. చాలా మంది జంతు సంక్షేమ పేజీలను ట్యాగ్ చేసి, అలాంటి కంటెంట్‌ను వెంటనే నిషేధించాలని కోరారు. ఎగిరే సమయంలో ఆ మూగజీవి ఎంత ఒత్తిడి, భయాన్ని అనుభవించి ఉంటుందని జంతుప్రేమికులు అంటున్నారు.
కానీ, సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం మండిపడ్డారు. ఈ వీడియో క్రూరత్వానికి పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ చాలా మంది కామెంట్ చేశారు.
వీడియో ఇక్కడ చూడండి…
ఈ వీడియో వైరల్‌గా మారడంతో సోషల్ మీడియా వేదికగా ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయారు. ఒక వైపు వినోదం పేరుతో దీనిని మూర్ఖత్వం అని కొందరు, దీనిని అల్లరిపనిగా మరికొందరు వర్ణిస్తున్నారు. అయితే, మెజారిటీ ప్రజలు మాత్రం ఈ చర్యను తీవ్రంగా విమర్శించారు. ఒకరు దీనిపై ఇది జోక్ కాదు, ఇది జంతు హింస అని రాశారు. మరొకరు కంటెంట్ పేరుతో ప్రజలు ఇప్పుడు అన్ని హద్దులు దాటేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలను పోస్ట్ చేసే వారిపై జంతు హింస చట్టం కింద కేసు నమోదు చేయాలని కూడా కొందరు అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…