Viral Video: నీటిలోకి దిగిన ఏనుగు.. తొండాన్ని పట్టుకున్న మొసలి.. భీకర యుద్ధంలో గెలుపు ఎవరిదంటే..

ఏనుగు, మొసలి మధ్య జరిగిన పోరాటానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది అడవిలో ప్రతి క్షణం జీవన్మరణ యుద్ధం కొనసాగుతుందని నిరూపించింది. రెండు జంతువుల మధ్య జరిగే ఈ పోరాటం ఉత్కంఠభరితమైనది మాత్రమే కాదు, ఆశ్చర్యకరమైనది కూడా.

Viral Video: నీటిలోకి దిగిన ఏనుగు.. తొండాన్ని పట్టుకున్న మొసలి.. భీకర యుద్ధంలో గెలుపు ఎవరిదంటే..
Elephant Video Viral
Image Credit source: X/@TheeDarkCircle

Updated on: Sep 08, 2025 | 12:12 PM

అడవిలో వివిధ రకాల సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వేటాడే జంతువులు .. తమ ఆహారం కోసం జంతువుల వేట కొనసాగిస్తూనే ఉంటాయి. సింహాలు, పులులు వంటి ప్రమాదకరమైన జంతువులు భూమిపై వేటాడతాయి. అయితే మొసళ్ళు నీటిలోనే జంతువులను వేటాడతాయి. మొసలికి భూమి మీదకంటే నీటిలో ఉన్నప్పుడే అధికమైన బలం ఉంటుంది. అందుకనే మొసళ్ళు నీటిలో ఉన్నప్పుడు చాలా ప్రమాదకరమైనవి. నీటిలో ఉన్న సమయంలో ఎటువంటి జంతువుపైన అయినా దాడి చేస్తాయి. అయితే.. కొన్నిసార్లు ఈ ప్రక్రియలో ఓటమిని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ రోజుల్లో అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది.

నిజానికి.. ఒక ఏనుగుల గుంపు నది ఒడ్డుకు నీరు త్రాగడానికి వచ్చింది. ఆ సమయంలో నీటిలో ఉన్న మొసలి ఒక ఏనుగును వేటాడేందుకు ప్రయత్నించింది. ఈ వీడియోలో ఒక ఏనుగు తన మందతో నది ఒడ్డున నిలబడి ఉండగా.. అకస్మాత్తుగా నీటిలో ఒక అలజడి తలెత్తింది. ఒక మొసలి ఏనుగు తొండాన్ని పట్టుకుంది. దీంతో ఆ ఏనుగు తనని తాను రక్షించుకునెందుకు పోరాటం చేసింది. తన తొండాన్ని బలంగా ఊపి వెనక్కి తీసుకోవలనికి ప్రయత్నించింది. అయితే మొసలి ఏనుగు తొండాన్ని వదలడానికి ఇష్టపడలేదు. అయితే ఏనుగు తన బలం అంతా ఉపయోగించి మొసలి దాడి నుంచి తనను తాను రక్షించుకుంది. తన బరువైన పాదాలతో మొసలిని తొక్కి చంపేసింది. ఈ దృశ్యం చాలా షాకింగ్‌గా ఉంది.

ఈ అద్భుతమైన వన్యప్రాణుల వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో @TheeDarkCircle అనే ఐడి షేర్ చేసింది. కేవలం 16 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటివరకు 2 లక్షల 72 వేలకు పైగా వీక్షించారు. వందలాది మంది దీన్ని లైక్ చేశారు.

వీడియోను ఇక్కడ చూడండి

ఈ ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని చూసిన ప్రజలు సోషల్ మీడియాలో భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇది నేషనల్ జియోగ్రాఫిక్ కంటే నిజమైన యుద్ధం’ అని రాశారు, మరొకరు అడవికి నిజమైన రాజు ఎవరో స్పష్టంగా తెలుస్తుంది’ అని, ‘మొసలి సులభంగా ఆహారం దొరుకుతుందని భావించింది.. కానీ అదే బలైపోయింది అని కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..