Viral Video: వేవ్స్‌ సమ్మిట్‌లో చిరంజీవి సందడి… ఆకట్టుకుంటున్న అలనాటి మేటి హీరోల గ్రూప్‌ ఫోటో

వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌ను ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా వేవ్స్ సమ్మిట్‌ జ‌ర‌గ‌నుంది. ‘కనెక్టింగ్‌ క్రియేటర్స్‌.. కనెక్టింగ్‌ కంట్రీస్‌’ అనే ట్యాగ్ లైన్ తో ఈ వేవ్స్ సమ్మిట్ ను...

Viral Video: వేవ్స్‌ సమ్మిట్‌లో చిరంజీవి సందడి... ఆకట్టుకుంటున్న అలనాటి మేటి హీరోల గ్రూప్‌ ఫోటో
Chiranjeevi Waves Summit

Updated on: May 01, 2025 | 4:45 PM

వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్టైన్మెంట్‌ సమ్మిట్‌ను ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా వేవ్స్ సమ్మిట్‌ జ‌ర‌గ‌నుంది. ‘కనెక్టింగ్‌ క్రియేటర్స్‌.. కనెక్టింగ్‌ కంట్రీస్‌’ అనే ట్యాగ్ లైన్ తో ఈ వేవ్స్ సమ్మిట్ ను నిర్వ‌హిస్తున్నారు. మీడియా, వినోద పరిశ్రమల‌ను ఒకచోట చేర్చే ప్రోగ్రామ్‌ ఇది. ఈ కార్య‌క్ర‌మానికి మీడియా, వినోద రంగానికి చెందిన సీఈఓలు, పరిశ్రమల‌కి చెందిన ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నారు.

వేవ్స్ అనేది కేవలం ఒక పదం కాదని.. ఇది సంస్కృతి, సృజనాత్మకత, చలనచిత్ర సంగీతం, గేమింగ్, కథ చెప్పడం.. లాంటి కలయిక అంటూ ప్రధాని మోదీ వెల్లడించారు. గ‌త వందేళ్ల‌లో భార‌తీయ సినిమా ఉన్న‌త శిఖ‌రాల‌కి కూడా చేరుకుంద‌ని ప్ర‌ధాని వివరించారు. ఈ సమ్మిట్‌లో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్ , రణ్‌బీర్ కపూర్ , దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా, రజనీకాంత్, చిరంజీవి, మోహన్ లాల్ సహా ఇతర ప్రపంచ స్థాయి నటీనటులు సందడి చేశారు.

అయితే ర‌జనీకాంత్, మోహ‌న్ లాల్, హేమ మాలిని, చిరంజీవి, అక్ష‌య్ కుమార్, మిథున్ చ‌క్ర‌వ‌ర్తి, మోహ‌న్ లాల్ క‌లిసి ఓ గ్రూప్ ఫొటోకు ఫోజులిచ్చారు. నెట్టింట ఈ పిక్ ఎంత‌గానో వైరల్‌ అవుతోంది. చాలా రోజుల త‌ర్వాత ఆ నాటి సీనియ‌ర్ హీరోలు అంద‌రు క‌లిసి ఇలా ఫొటో దిగగా, ఇప్పుడు ఈ పిక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అల‌నాటి మేటి స్టార్స్ ఇలా ఒకే గ్రూప్ పిక్‌లో చూడ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని నెటిజ‌న్స్ పోస్టులు పెడుతున్నారు. కాగా, ఈ కార్య‌క్ర‌మం కోసం చిరంజీవి బుధవారమే ముంబ‌యికి చేరుకున్నారు.

 

వీడియో చూడండి: