Cat Begging for Pizza: సోషల్ మీడియా ప్రతిఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత తమ పెంపుడు జంవుతులు చేసే చిలిపి పనులను షేర్ చేస్తూ.. సంతోష పడుతున్నారు. ముఖ్యంగా కుక్క, పిల్లి, ఏనుగు వంటి జంవుతులకు చెందిన వీడియోలు నెటిజన్ల ను అమితంగా ఆకర్షిస్తుంటాయి. వాటి చేష్టలను చూస్తూ.. తనివితీరా నవ్వుకుంటారు. తాజాగా ఓ పిల్లి తనకు పిజ్జా ఇవ్వమని అడిగిన తీరు ఎవరినైనా ఆకట్టుకుంటుంది. ఆ పిల్లి పిజ్జా అడగడం కోసం అతి దీనంగా ఫేస్ ఫీలింగ్ ను పెట్టిన తీరు నవ్వులు పూయించింది.
క్యాట్స్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఒక వ్యక్తి తన చేతిలో పిజ్జా ముక్కను పట్టుకుని పిల్లికి చూపిస్తున్నాడు. ఆ పిజ్జా చేసిన ఓ నల్ల పిల్లికి నోరూరినట్లు ఉంది. తినాలి అనిపించినట్లు ఉంది.. దీంతో ఆ వ్యక్తిని తనకు పిజ్జా ఇవ్వమని రెండు కాళ్ళ మీద నిలబడి.. రెండు కాళ్లని చేతులుగా మార్చుకుని దణ్ణం పెడుతూ.. అడిగిన తీరు ఎవరికైనా మనసుకు తాకుతుంది. పిల్లి పిల్ల మాములుదు కాదనిపిస్తుంది. వెంటనే మనం ఆ పిజ్జాను ఆ వ్యక్తి చేతి నుంచి తీసుకుని ఆ నల్ల పిల్లికి ఇవ్వాలనిపిస్తుంది.
ఈ వీడియోను ఆ పిల్లి తరపునే క్యాప్షన్ చేశారు. ‘అందరికీ నమస్కారం! కొత్త ఫాలోవర్స్ అందరికీ ధన్యవాదాలు. కొత్త వ్యక్తులందరికీ నన్ను పరిచయం చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించాలని అనుకున్నాను. నా పేరు వాడ్స్‌వర్త్, అకా వాడీ. నాకు అడుక్కోవడం చాలా ఇష్టం. జాక్స్, కట్లర్, మిస్టరీ అనే ముగ్గురు తోబుట్టువులు నాకు ఉన్నారు’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో షేర్ చేసినప్పటి నుంచి నెటిజన్లను ఆకట్టుకుంటుంది. 1.4 మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. అనేకమంది పిల్లుల ప్రేమికులను ఆకట్టుకుంది. “స్పిరిట్ యానిమల్” అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: శ్రీవారి భక్తులకు ఈవో విజ్ఞప్తి.. తిరుమలలో బస చేసేవారు విద్యుత్ ఆదా చేయాలని..