Video: కుర్రాడి ఇన్‌స్టా రీల్‌ ఒక తాత నిండు ప్రాణాలు కాపాడింది! నమ్మట్లేదా..? మీరే చూడండి!

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తరచుగా విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ, ఈసారి ఒక యువకుడు రైల్వే స్టేషన్‌లో రీల్ చిత్రీకరిస్తూ గొప్ప పని చేశాడు. కదులుతున్న రైలు నుండి జారిపడిన వృద్ధుడి ప్రాణాలను సమయస్ఫూర్తితో కాపాడాడు. ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలో భారీ ప్రశంసలు అందుకుంది.

Video: కుర్రాడి ఇన్‌స్టా రీల్‌ ఒక తాత నిండు ప్రాణాలు కాపాడింది! నమ్మట్లేదా..? మీరే చూడండి!
Boy Saves Elderly Man

Updated on: Oct 26, 2025 | 10:14 PM

ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ తయారు చేయడం ఫ్యాషన్‌గా మారింది. ఇంట్లో, రోడ్డు మీద, బస్సులో, రైలులో, విమానంలో ఇలా దీన్ని కూడా వదట్లేదు. ప్రతిచోటా రీల్స్ చేస్తున్నారు. అయితే అనేక సందర్భాల్లో పబ్లిక్‌ ప్లేసుల్లో రీల్స్‌ చేసే వారు విమర్శలే ఎక్కువ ఎదుర్కొన్నారు. కొంతమంది పాపం పోలీస్‌ కేసుల పాలయ్యారు కూడా. అయితే తాజాగా ఓ కుర్రాడు రైల్వే స్టేషన్‌లో రీల్‌ చేస్తూ ఓ వృద్ధుడి ప్రాణాలు కాపాడాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఒక బాలుడు ప్లాట్‌ఫామ్‌పై డ్యాన్స్ రీల్ చేస్తున్నప్పుడు రైలు కదులుతున్నట్లు మీరు చూడవచ్చు. ఇంతలో కదులుతున్న రైలు నుండి దిగుతుండగా ఒక వృద్ధుడు అకస్మాత్తుగా పడిపోయాడు. రైలు వేగం పుంజుకోవడంతో ఆ వృద్ధుడు బ్యాలెన్స్ కోల్పోయి పడిపోయాడు. రీల్ చిత్రీకరిస్తున్న బాలుడు వెంటనే ఆ వృద్ధుడిని పట్టుకోవడం అదృష్టం, లేకుంటే తీవ్రమైన ప్రమాదం జరిగి ఉండేది. అందువల్ల సోషల్ మీడియా కూడా ప్రాణాలను కాపాడుతుందని చాలా మంది అంటున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్)లో @guru_choudhary0 అనే ఖాతా ద్వారా షేర్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us