Viral Video: బస్సు మిస్సవుతుందని చూసుకోకుండా పరిగెత్తిన బాలుడు.. అంతలోనే ఢీకొట్టిన మరో బస్సు.. షాకింగ్‌ వీడియో!

కర్ణాటక రాజధాని బెంగళూరులో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. కాలేజ్ బస్సు మిస్సవుతుందన్న తొందరలో పరిగెత్తుకుంటూ రోడ్‌ క్రాస్‌ చేస్తున్న విద్యార్థిని అటుగా వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన షాకింగ్‌ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: బస్సు మిస్సవుతుందని చూసుకోకుండా పరిగెత్తిన బాలుడు.. అంతలోనే ఢీకొట్టిన మరో బస్సు.. షాకింగ్‌ వీడియో!
Viral Video

Updated on: Jul 04, 2025 | 2:57 PM

కాలేజ్‌ బస్సుకోసం పరిగెడుతూ రోడ్‌ క్రాస్‌ చేయబోయిన 17 ఏళ్ల విద్యార్థిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెలితే.. స్థానికంగా ఉన్న ఓ కాలేజ్‌లో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్ చదువుతున్న ఓ 17 ఏళ్ల విద్యార్థి బుధవారం ఉదయం కాలేజ్‌కు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఇంతలో ఆఫోజిట్‌ రోడ్‌ తాను ఎక్కాల్సిన కాలేజ్‌ బస్సు వెళ్తుండటం గమనించాడు. దీంతో బస్సు వెళ్లిపోతుందన్న తొందర్లో రోడ్డుకు ఇరువైపులా వస్తున్న వాహనాలను చూసుకోకుండా రోడ్డు క్రాస్ చేసేందుకు పరిగెత్తాడు. ఇంతలో అటుగా వేగంగా వచ్చిన ఓ ఆర్డీసీ బస్సు బాలుడిని బలంగా ఢీ కొట్టింది.

షాకింగ్‌ వీడియోకి సంబంధించిన పోస్ట్‌ను చూడండి..

ఈ ప్రమాదంలో కాలేజ్‌ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికలు గాయపడిన విద్యార్థిని 108 సహాయంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పడంతో స్థానికులు ఊపరికి పీల్చుకున్నారు. స్థానికంగా ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లో ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. అవి కాస్తా ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.