అయోధ్యలోని రామమందిరంలో ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జనవరి 22న కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి దేశానికి సంబంధించిన అనేక రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. అంతేకాదు భారతదేశంలోని నలుమూల్లో ఉన్న శ్రీరామ భక్తులను అయోధ్య నుండి తీసుకువచ్చిన అక్షతతో ఆహ్వానిస్తున్నారు. ఇలా రామయ్య అక్షతలను పది మందికి అందిస్తున్న ఓ చిన్న కుర్రాడి వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. రామ మందిర ప్రతి ష్ఠాపన సందర్భంగా అయోధ్య రామమందిరానికి అక్షతలను ఇస్తూ.. రామ విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వానిస్తున్న ఓ చిన్నారి బాలుడికి వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
I'm not getting enough of this 😍 The lil lalla is too adorable to even ignore 😍❤️🥳🥳
ఇవి కూడా చదవండిMuch love beta ❤️
Sri Ram aapki sadaiv raksha kare 🙏Jai Shri Ram 🚩 pic.twitter.com/wCU0ADhDq8
— Usha (@mauna_adiga) January 13, 2024
ఈ వీడియో ‘X’ ఖాతా @mauna_adigaలో షేర్ చేయబడింది. వీడియోను నెటిజన్లు ఇష్టపడుతున్నారు. లక్షలాది మంది రామ భక్తులు ఇప్పటికే చిన్నారి బాలుడి భక్తిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ బాలుడు వేద మంత్రాల సాక్షిగా అక్షతలను ఇంటింటికి అందిస్తూ.. మురళిని వాయిస్తున్నాడు. చిన్నారి కన్నయ్యలా కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..