Viral Video: టవల్‌ను అమాంతం మింగిన పైథాన్.. ఆపై ఉక్కిరి బిక్కిరి.. వెటర్నరీ డాక్టర్లు ఏం చేశారంటే..?

బాగా ఆకలితో ఉన్న ఓ పైథాన్‌ పెద్ద టవల్‌ను మింగేసింది. ఆపై పొట్ట ఉబ్బిపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యింది. దీంతో వెటర్నరీ డాక్టర్లు రంగంలోకి దిగారు.

Viral Video: టవల్‌ను అమాంతం మింగిన పైథాన్.. ఆపై ఉక్కిరి బిక్కిరి.. వెటర్నరీ డాక్టర్లు ఏం చేశారంటే..?
Python Swallows Towel

Updated on: Jul 29, 2022 | 6:13 PM

Trending Video: పాములు చాలా డేంజర్. అవి ఆకలితో ఉంటే.. ఏది దొరికితే దాన్ని తినేస్తాయి. పిల్లల్ని, సాటి పాముల్ని కూడా తినే స్నేక్స్ ఉంటాయి. కొన్నిసార్లు ప్లాస్టిక్ లేదా ఇతర జీర్ణం కాని భారీ వస్తువులను తిని ప్రాణం మీదకు తెచ్చుకుంటాయి. అందుకే ఆకలి వేస్తే పులులు కూడా గడ్డి తింటాయి అంటారు కాబోలు పెద్దలు. అలానే ఓ కొండచిలువ ఆకలితో అల్లాడిపోయింది. వేటాడి తినేందుకు ఏ జీవీ దొరకలేదు. కనీసం చిన్న, చిన్న కప్పలు, ఎలుకలు సైతం తారసపడలేదు. దీంతో ఓ టవల్ కనిపించడంతో.. అమాంతం మింగేసింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో వెలుగుచూసింది. ఆపైనే అసలు సమస్య వచ్చిపడింది. ఆ టవల్ ఎలాగూ జీర్ణం కాదు. బయటకు కక్కుదామంటే వీలు కుదరడం లేదు. దీంతో భారీ పొట్టతో కళ్లు తేలేసి.. అవస్థలు పడుతున్న ఆ భారీ పైథాన్‌ను కొందరు చూశారు. ఆపై వెంటనే దాన్ని న్యూ సౌత్ వేల్స్‌లోని SASH జంతు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పైథాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వెంటనే రంగంలోకి దిగారు. దానికి అనస్థీషియా ఇచ్చి.. వర్క్ షురూ చేశారు. దాని కడుపులోకి ఓ టూల్‌ పైప్‌ను పంపి.. అతి కష్టం మీద ఆ టవల్‌ బయటకు తీశారు. అలా ఆ పైథాన్‌ ప్రాణం నిలిపారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ వీడియో పాతదే అయినప్పటికీ మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

వీడియో దిగువన చూడండి 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి