Viral Video: లైవ్‌ కవరేజ్‌ ఇస్తున్న జర్నలిస్టుపై పోలీసుల కాల్పులు… లాస్ ఏంజిల్స్‌ నిరసనల్లో జరిగిన ఘటన వైరల్‌

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఫెడరల్ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. స్థానికులకు విపక్ష డెమొక్రటిక్‌ పార్టీ మద్దతుదారులు, విదేశీయులు తోడవ్వడంతో ఒక్కసారిగా ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ఆగ్రహంతో నిరసనకారులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పలు చోట్ల...

Viral Video: లైవ్‌ కవరేజ్‌ ఇస్తున్న జర్నలిస్టుపై పోలీసుల కాల్పులు... లాస్ ఏంజిల్స్‌ నిరసనల్లో జరిగిన ఘటన వైరల్‌
Police Firing On Journalist

Updated on: Jun 11, 2025 | 4:03 PM

అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఫెడరల్ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. స్థానికులకు విపక్ష డెమొక్రటిక్‌ పార్టీ మద్దతుదారులు, విదేశీయులు తోడవ్వడంతో ఒక్కసారిగా ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ఆగ్రహంతో నిరసనకారులు పోలీసులపై దాడికి ప్రయత్నించారు. పలు చోట్ల ఆందోళనకారులు కార్లను తగులబెడుతున్నారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీచార్జి, టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు.

అయితే నిరసకారులతోపాటు జర్నలిస్టుపై కూడా పోలీసులు రబ్బరు బుల్లెట్‌తో కాల్పులు జరిపారు. నైన్ న్యూస్‌ ఆస్ట్రేలియాకు చెందిన జర్నలిస్టు లారెన్ టోమాసి, లాస్ ఏంజిల్స్‌ నిరసనలపై ఆదివారం లైవ్‌ రిపోర్ట్‌ ఇస్తున్నారు. ఇంతలో ఒక పోలీస్ అధికారి ఆమె కాలుపై రబ్బరు బుల్లెట్‌తో కాల్పులు జరిపాడు. ఆమె గాయపడినప్పటికీ లైవ్‌ రిపోర్ట్‌ను కొనసాగించింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

వీడియో చూడండి:

 

 

మరోవైపు ఆస్ట్రేలియా విదేశాంగ శాఖ ఈ సంఘటనను ఖండించింది. జర్నలిస్టులు తమ పనిని సురక్షితంగా చేసుకోగలగాలి. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగేలా చర్యలు తీసుకునే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది.