Viral Video : పెంపుడు కుక్కులు నమ్మితే ప్రాణాలు ఇస్తాయి. అలాంటి కుక్కలు.. ఈ మధ్య కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మారాయి. మారడమే కాదు.. ఇంటి యజమానులకు నమ్మిన బంటులా, వారిని కంటికి రెప్పలా చూసుకునే పెట్‌లా మారాయి. రోజువారీ పనుల్లోనే కాదు.. కొన్ని కుక్కలు వ్యవసాయపనుల్లోనూ తోడుగా నిలుస్తున్నాయి. తాజాగా ఇలాంటి కుక్కుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కుక్క.. తొలుత దేనికోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంటుంది. ఆ వెంటనే నీళ్లు రావడంతో అలర్ట్ అవుతుంది. వచ్చే నీరు ఎలాంటి ఆటంకం లేకుండా మొక్కలకు పారేలా చేయాలనుకుంది. ఆలోచన రావడమే తరువాయి.. నీళ్లు రావడంతోనే.. తన కాళ్లతో కాలువలా తవ్వకుంటు పోతూ ఆ నీరు అటూ ఇటు పోకుండా ఒకే ధారలో పారేలా చేసింది. ఇలా నీటి ధారను ఓ పద్దతి ప్రకారం తీసుకెళ్లే యత్నం చేసింది. ఒక్కసారిగా నీటిని విడుదల చేయడంతో.. వాటిని వేస్ట్ కాకుండా చూసింది. తన యజమాని వ్యవసాయభూమి పనుల్లో ఉన్న సమయంలో కుక్క తన కాళ్లతో కాలువను తవ్వుకుంటూ ముందుకు పోయింది. కెనాల్ కన్‌స్ట్రక్షన్ స్పెషలిస్టుగా నీటిని ధారలా పారించి అదుర్స్ అనిపించింది. నిజంగా కుక్క తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాలి. కాళ్లను పారలా చేసుకుని.. వస్తున్న నీటిని క్రమపద్దతిలో కెనాల్ రూపంలో వచ్చేలా చేసి అందరితో శభాష్ అనిపించుకుంది ఈ రైతు కుక్క.
Also read:
Flying Object: క్రొయేషియాలో కుప్పకూలిన వింత వస్తువు.. కూలిన చోట భారీ గొయ్యి.. UFO అంటూ అనుమానాలు..!
Health Tips: ఈ 11 లక్షణాలను మహిళలు అస్సలు విస్మరించకూడదు.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..
Andhra Pradesh: ఐదు పదుల వయసులో ఆవహించిన అనుమాన భూతం.. ఎవరితోనో అఫైర్ ఉందంటూ భార్యను..!