Viral Video: మళ్లీ దొరికిన రాకాసి చేప.. హడలిపోతున్న జనాలు.. భయానికి కారణమదేనట..!

|

Jul 15, 2022 | 3:09 PM

Viral Video: చిలీలో అరుదైన, ప్రమాదకరమైన చేప చిక్కింది. దీనిని కింగ్ ఆఫ్ హెర్రింగ్స్ లేదా ఓర్‌ ఫిష్‌ అని పిలుస్తారు.

Viral Video: మళ్లీ దొరికిన రాకాసి చేప.. హడలిపోతున్న జనాలు.. భయానికి కారణమదేనట..!
Fish
Follow us on

Viral Video: చిలీలో అరుదైన, ప్రమాదకరమైన చేప చిక్కింది. దీనిని కింగ్ ఆఫ్ హెర్రింగ్స్ లేదా ఓర్‌ ఫిష్‌ అని పిలుస్తారు. దీని పొడవు దాదాపు 16 అడుగులు ఉంది. ఈ రాకాసి చేప దొరికిందని తెలియగానే.. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల హుక్‌కు ఈ చేప చిక్కింది. అయితే ఈ ఓర్ చేప కనిపిస్తే.. అది అపశకునమని విశ్వసిస్తారు చిలీ ప్రజలు. ఏదో కీడు జరగబోతుందని నమ్ముతారు. ఈ చేప 2011లో జపాన్‌ సముద్ర తీరంలో కనిపిచిందని.. ఆ తర్వాత భారీ సునామీ జపాన్‌పై విరుచుకుపడిందని కొందరు చెబుతున్నారు. జపాన్‌లో సునామీని ఓర్ ఫిష్ ముందుగానే పసిగట్టిందని.. ఇప్పుడు చిలీలో కూడా అలాంటి విపత్తే రావచ్చని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..