Viral Video: స్క్రాప్‌ రిక్షాలో అన్నను అస్పత్రికి తీసుకెళ్లిన 11 ఏళ్ల బాలుడు… మనసును కలిచివేసే దృశ్యం

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న కొన్ని రకాల వీడియోలు నెటిజన్స్‌ మనసును ద్రవింపజేస్తాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో ఒకటి కన్నీళ్లు తెప్పిస్తోంది. గాయపడిన తన సోదరుడిని స్క్రాప్ రిక్షాలో ఒక చిన్న పిల్లవాడు లాగుతున్న హృదయ విదారకమైన వీడియో వైరల్‌ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని....

Viral Video: స్క్రాప్‌ రిక్షాలో అన్నను అస్పత్రికి తీసుకెళ్లిన 11 ఏళ్ల బాలుడు... మనసును కలిచివేసే దృశ్యం
11 Year Old Pulls Injured B

Updated on: Apr 18, 2025 | 3:00 PM

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న కొన్ని రకాల వీడియోలు నెటిజన్స్‌ మనసును ద్రవింపజేస్తాయి. తాజాగా అలాంటిదే ఓ వీడియో ఒకటి కన్నీళ్లు తెప్పిస్తోంది. గాయపడిన తన సోదరుడిని స్క్రాప్ రిక్షాలో ఒక చిన్న పిల్లవాడు లాగుతున్న హృదయ విదారకమైన వీడియో వైరల్‌ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలిలో జరిగిన ఈ సంఘటనతో అక్కడ ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో లేవనే విషయాన్ని చాటిచెబుతోంది.

హసన్‌పూర్ గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో 13 ఏళ్ల బాలుడు గోడపై నుండి పడి గాయపడ్డాడు. అంబులెన్స్‌ను కోసం అనేకసార్లు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. అనంతరం కేవలం 11 ఏళ్ల అతని తమ్ముడు తన అన్నయ్యను ట్రై-సైకిల్ స్క్రాప్ రిక్షాలో పడుకోబెట్టాడు. అతను స్క్రాప్ బండిని ఆసుపత్రి వరకు లాగాడు. ఇంతలో ఒక మహిళ కూడా బహుషా అతని తల్లి కావొచ్చు, అతనితో పాటు నడుస్తున్నట్లు కనిపించింది. కెమెరాలో చిక్కుకున్న ఈ భావోద్వేగ క్షణం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గ్రామాల్లో వైద్య సేవలు ఎలా ఉంటాయో ఈ వీడియోనే నిదర్శనం.

వైరల్‌ అవుతోన్న వీడియోపై నెటిజన్స్‌ తీవ్రంగా స్పందిస్తున్నారు. వేలాది మంది యూజర్లు షేర్‌ చేశారు. ఇది ఆరోగ్య వ్యవస్థ పరిస్థితి అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇంతలో, స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ ముందు ప్రజల ఆగ్రహం ఈ సంఘటనను వెలుగులోకి తెచ్చిందని నివేదికలు వెల్లడించాయి. “రాయ్‌బరేలి ఎంపీని ట్యాగ్ చేసి ఉండాలి. ఇన్ని సంవత్సరాలుగా నిధిని ఎలా వినియోగించారనే దానిపై వివరణాత్మక విచారణ జరపాలని నెటిజన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. ప్రజలు చెల్లించే పన్ను చెత్తబుట్టలో పోతుందా అని ప్రశ్నిస్తున్నారు.

గాయపడిన చిన్నారికి సరైన వైద్య చికిత్స అందుతున్నట్లు వైద్యులు ధృవీకరించారు. చిన్న పట్టణాలు లేదా నగరాల్లో వైద్య సౌకర్యాలు లేకపోవడాన్ని ఎత్తిచూపే ఇటువంటి సంఘటనలు స్థానికంగా ఉన్న వాస్తవికతను బహిర్గతం చేస్తూనే ఉన్నాయి.

 

వీడియో చూడండి: