Viral Video: కోనసీమ అల్లుడంటే అంతే మరి.. ఆషాడం అల్లుడికి 100 రకాల వంటలతో విందు..

|

Aug 13, 2024 | 12:41 PM

కోనసీమ జిల్లా వాసులు అల్లుడి మర్యాదలు మాత్రం వెరీ వెరీ స్పెషల్. సంక్రాంతి పండగకు మాత్రమే కాదు ఆషాడ మాసం తర్వాత ఇంటికి వచ్చే కొత్త అల్లుడికి ఇచ్చే మర్యాదలు కూడా అందరిని ఆకట్టుకుంటాయి. తాజాగా ఆషాడం మాసం తర్వాత ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తారింట్లో జరిగిన మర్యాదలు పెట్టిన పిండి వంటలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Viral Video: కోనసీమ అల్లుడంటే అంతే మరి.. ఆషాడం అల్లుడికి 100 రకాల వంటలతో విందు..
Viral Video
Follow us on

భారతీయ వివాహవ్యవస్థ అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. మన కుటుంబ వ్యవస్థను విదేశీయులు కూడా ఎంతగానో గౌరవిస్తారు. పెళ్లి చేసిన ఆడపిల్లను అత్తారింటికి పంపించడం మొదలు పండగలు, పర్వదినాలు, శుభకార్యాలు సమయంలో కూతురు అల్లుడిని తమ ఇంటికి తీసుకుని వస్తారు. అల్లుడిని ఎంతో గౌరవిస్తారు. మర్యాదలు చేస్తారు. అయితే కోనసీమ జిల్లా వాసులు అల్లుడి మర్యాదలు మాత్రం వెరీ వెరీ స్పెషల్. సంక్రాంతి పండగకు మాత్రమే కాదు ఆషాడ మాసం తర్వాత ఇంటికి వచ్చే కొత్త అల్లుడికి ఇచ్చే మర్యాదలు కూడా అందరిని ఆకట్టుకుంటాయి. తాజాగా ఆషాడం మాసం తర్వాత ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తారింట్లో జరిగిన మర్యాదలు పెట్టిన పిండి వంటలకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళ్తే..

ఇవి కూడా చదవండి

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ‌కు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇందులో ఓ అల్లుడి ముందు ఎవరూ ఊహించని విధంగా రకరకాల పదార్ధాలను వ‌డ్డించారు. గత ఏడాది సెప్టెంబరులో వివాహం జరగగా మొదటి ఆషాఢ మాసం సందర్భంగా అత్తింటికి నెల పాటు దూరంగా ఉన్న అల్లుడికి.. అత్తారింట్లో డజన్ల కొద్దీ రుచికరమైన వంటకాలతో స్వాగతం పలికారు. పూతరేకులు, మైసూర్ పాక్ వరకు 100 రకాల వంటకాలు వడ్డించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలోని ఒక గ్రామంలో జరిగిన ఈ అతిథి సత్కారానికి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అందులో కొత్త జంటకు వడ్డించిన వంటకాలు కనిపిస్తాయి.

ఈ వీడియోలో 2023లో పెళ్లి చేసుకున్న జంట రత్న కుమారి, రవితేజగా గుర్తించారు. రవి, అతని భార్య కలిసి ఈ సంవత్సరం మొదటి ఆషాఢ మాసాన్ని పూర్తి చేసుకున్నారు. నెల రోజుల తర్వాత తమ ఇంటికి వచ్చిన అల్లుడు, కొత్త అల్లుడికి సాంప్రదాయ విందు ఏర్పాటు చేసినట్లు నివేదించబడింది.

నివేదికల ప్రకారం రకరకాల సీట్స్, జ్యూస్‌లు, పానీయాలు, కూరలు వంటి వివిధ రకాల వంటకాలను అందించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కోనసీమ అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. అల్లుడికి ఆ మాత్రం మర్యాద చేయాల్సిందే..

 

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..