Viral News: ప్రపంచంలోని అత్యంత సుందర ప్రాంతంలో ఏంటీ పాడు పని.. నెటిజన్ల ఆగ్రహం

ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఓ చిన్న ఫోటో అయినా, వీడియో అయినా సరే అలా సర్కులేట్ అయిపోయింది.

Viral News: ప్రపంచంలోని అత్యంత సుందర ప్రాంతంలో ఏంటీ పాడు పని.. నెటిజన్ల ఆగ్రహం
Tourists Caught Peeing

Edited By: Team Veegam

Updated on: Mar 15, 2021 | 7:45 PM

ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఓ చిన్న ఫోటో అయినా, వీడియో అయినా సరే అలా సర్కులేట్ అయిపోయింది. అందుకు ఇటీవల జోమాటో కస్టమర్, డెలివరీ బాయ్ వివాదం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ఫన్నీ ఫోటోలు, వీడియోలు వైరల్ అయితే మరికొన్నిసార్లు సీరియస్ ఇన్సిడెంట్లు కూడా నెటిజన్లు వైరల్ చేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఫోటో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతుంది. రోడ్డు పక్కన వరసగా నిలబడి చాలామంది మూత్ర విసర్జన చేస్తున్న ఫోటో అది.

అందుతోన్న  సమాచారం ప్రకారం, ఈ ఫోటో జమ్మూ కాశ్మీర్‌ తీసినదిగా తెలుస్తోంది. దాల్ సరస్సు ఒడ్డున చాలా మంది పర్యాటకులు నిలబడి మూత్ర విసర్జన చేస్తున్నారు. ప్రజలు అదే దారిలో వాహనాలపై ప్రయాణిస్తున్నారు.. మరికొందరు నడుచుకుంటూ వెళ్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఈ చిత్రాన్ని ‘లిసిప్రియా కంగుజమ్’ అనే యూజర్ షేర్ చేశారు. ‘భారత పర్యాటకులు అందమైన కాశ్మీర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున మూత్ర విసర్జన చేయడం షాక్‌కు గురిచేసింది. వీరి ఆలోచనా ధోరణి ఎప్పుడు మారుతుంది. దాల్ సరస్సు ప్రపంచలోనే అందమైనది” అని సదరు ఫోటోకు క్యాప్షన్ కూడా పెట్టింది. ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్ల ఆగ్రహం మాములుగా లేదు.

సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫామ్‌లలో ప్రజలు ఈ చిత్రాన్ని సర్కులేట్ చేస్తున్నారు. ఓ రేంజ్‌లో రీ ట్వీట్లు వస్తున్నాయి. కామెంట్లు కూడా ఓ రేంజ్‌‌లో చేస్తున్నారు. ‘ఈ రకమైన పనిని ఆపాలి’ అని ఒక యూజర్ రాసుకొచ్చాడు. మరొకరు, ‘అసలు ఎటు వైపు వెళ్తున్నాం’ అని కామెంట్ పెట్టారు.

Also Read:  Zomato delivery boy case: మహిళ, డెలివరీ బాయ్ తమ, తమ వెర్షన్స్ చెప్పారు.. తాజాగా జొమాటో నుంచి ప్రకటన

  Crime News: భార్య ఫోటో, ఫోన్ నంబర్ ఉన్న పోస్టర్లను ఈ ప్రబుద్దుడు ఊరంతా అంటించాడు.. ఎందుకంటే..?

భార్య ఫోటో, ఫోన్ నంబర్ ఉన్న పోస్టర్లను ఈ ప్రబుద్దుడు ఊరంతా అంటించాడు.. ఎందుకంటే..?