Viral Video: సహచరుడి మరణం తట్టుకోలేని పాము.. హృదయ విదారక దృశ్యం

JCB కింద పడి చనిపోయిన తన భాగస్వామి కోసం ఓ పాము పడగ విప్పి రోదిస్తున్న హృదయవిదారక వీడియో వైరల్ అవుతోంది. జంతువుల ప్రేమ, భావోద్వేగాలు మనుషులకే పరిమితం కాదని, వాటిలోనూ గాఢమైన అనుబంధాలు ఉంటాయని ఈ దృశ్యం నిరూపిస్తోంది. సోషల్ మీడియాలో లక్షల వీక్షణలు పొందిన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి లోనవుతున్నారు.

Viral Video: సహచరుడి మరణం తట్టుకోలేని పాము.. హృదయ విదారక దృశ్యం
Snake

Updated on: Jan 24, 2026 | 10:19 AM

Snake Crying Video: ప్రేమ అనేది మనుషులకే కాదు.. జంతువుల్లో కూడా ఉంటుంది. జీవితంలో అద్భుతమైన ప్రేమను అనుభవించడం ప్రతి జీవికి ఒక వరం అని చెప్పాలి. మనుషులు మాత్రమే కాదు.. జంతువులు కూడా తాము ప్రేమించిన వాటి కోసం ఆరాటపడుతుంటాయి. అలాంటి వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో తరచూ వైరల్‌ అవుతుంటాయి. ఒక కోతి చనిపోతే కోతులన్నీ కలిసిపోతాయి. అలాగే, ఒక అడవి ఏనుగు మరణించినా కూడా దాని జత ఏనుగు కన్నీటి పర్యాంతం అవుతుంది.. ఇటీవల ఇలాంటి సంఘటనే పాములకు ఎదురైంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతున్నారు.

వీడియో వివరాల్లోకి వెళితే రెండు భారీ సర్పాలు కనిపిస్తున్నాయి. వాటిలో ఒకటి చనిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే.. అది కదలకుండా పడిపోయి ఉంది. మరొక పాము దానికి దగ్గరగా పడగ విప్పి ఉంది.. వాటి దూరంగా కొంతమంది జేసీబీ ఉపయోగించి పొలాల్లో కాలువలు తవ్వుతున్నారు. ఈ క్రమంలోనే ఒక పాము ప్రమాదవశాత్తు దాని టైర్ల కింద పడి చనిపోయిందని తెలిసింది. అయితే, ఇది గమనించిన మరో పాము చనిపోయిన పాము ముందుకు వచ్చి అలాగే చూస్తూనే ఉంటుంది. చాలా సేపటి వరకు అది అక్కడే ఉండి రోధిస్తున్నట్టుగా, విచారంగా ఉంది. అలా కొంత సమయం తరువాత అక్కడి నుండి వెళ్లిపోతుంది.

ఇవి కూడా చదవండి

సాధారణంగా ఈ రెండు పాములను చూస్తే వాటి మధ్య ప్రేమ ప్రత్యేకంగా నిలుస్తుంది. ప్రమాదవశాత్తు పాము మరణించిన తర్వాత, ఇప్పుడు మరో పాము ఒంటరిగా మిగిలిపోయింది. దీనికి సంబంధించిన అరుదైన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే, ఈ వైరల్ వీడియోను Salman_Pathan230 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పటివరకు, ఈ వీడియోను కొన్ని లక్షలకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. ఈ వీడియోను చూసిన చాలా మంది కామెంట్లలో ఇద్దరి మధ్య ప్రేమ గురించి మాట్లాడుతున్నారు. కొందరు ఇద్దరి మధ్య తెగిపోయిన బంధం గురించి వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు ఈ నాగుపాము తన ప్రేమికుడు చనిపోయాడని ఏడుస్తోందంటూ రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..