Watch: రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కాంక్రీట్‌ మిక్సర్..! షాకింగ్‌ వీడియో చూస్తే..

సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో కొన్ని షాకింగ్ వార్తలు, వీడియోలు కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఒక భయంకర ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఇందులో రోడ్డు దాటుతున్న మహిళను ఒక భారీ ట్రక్కు ఢీకొట్టింది. అంతటితో ఆగలేదు.. ఆ ట్రక్కు ఆమెను చాలా దూరం వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది.. ఈ షాకింగ్ వీడియో చూసిన నెటిజన్లు సైతం భయంతో వణికిపోతున్నారు.

Watch: రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన కాంక్రీట్‌ మిక్సర్..! షాకింగ్‌ వీడియో చూస్తే..
Road Accident

Updated on: Nov 03, 2025 | 4:10 PM

గత కొద్ది రోజులుగా వరుస రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఏదో ఒక మూలన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు భద్రత ప్రాముఖ్యత ఎప్పుడూ తీవ్రమైన సమస్యగానే మారుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఈ విషయాన్ని మరోసారి గుర్తుకు చేస్తుంది. రద్దీగా ఉండే రోడ్డును దాటడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు మహిళల్లో ఒకరిని భారీ వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటన రోడ్డుపై ఏర్పాటు చేసిన CCTV కెమెరాలలో రికార్డయింది.

సోషల్ మీడియాలో ఒక షాకింగ్‌ వీడియో వేగంగా వైరల్‌ అవుతోంది. వీడియోలో ఒక రద్దీగా ఉన్న రోడ్డు కనిపిస్తుంది. రోడ్డుపై గ్యాప్‌ లేకుండా కార్లు, ట్రక్కులు, స్కూటర్లతో సహా అనేక వాహనాలు ఒకదానికంటే ఒకటి వేగంగా ప్రయాణిస్తున్నాయి. ఇంతలో, ఇద్దరు మహిళలు రోడ్డు దాటుతూ కనిపించారు. కానీ, వారిలో ఒకరిని రోడ్డుపై వస్తున్న భారీ వాహనం కాంక్రీట్ మిక్సర్ ఢీకొట్టింది. ఆ మహిళ సరిగ్గా కాంక్రీట్‌ మిక్సర్‌ ముందు టైర్‌ కిందకు వెళ్లిపోయింది. వీడియోలో ట్రక్కు ఆ మహిళ మీదుగా వెళుతున్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పక్కనే ఉన్నమహిళ ట్రక్కు డ్రైవర్‌ను ఆపమంటూ వేడుకుంటోంది. కానీ, అప్పటికే ట్రక్కు చాలా దూరం వరకు మహిళను ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

వైరల్‌గా మారిన ఈ వీడియోపై నెటిజన్ల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ ప్రమాదం చాలా భయంకరంగా అనిపించింది. అయితే, ఆ మహిళ ప్రాణాలతో బయటపడిందో లేదో ఇంకా స్పష్టంగా తెలియలేదు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు దాటేటప్పుడు, ముఖ్యంగా సమీపంలో పెద్ద వాహనాలను చూసినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ చాలా మంది సూచించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..