Unique Tea Stall: నీ తెలివి తేటలు సూపర్ భయ్యా.. ‘చాయ్ జీపీటీ’ పేరుతో ఆకట్టుకుంటున్న వ్యాపారి..

|

May 18, 2023 | 2:13 PM

సృజనాత్మకత ఉంటే చాలు తమదైన ప్రత్యేక గుర్తింపును సులభంగా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఓ టీ వర్తకుడు చేసిన పని అలాగే ఉంది. ఇటీవల మనం చాట్ జీపీటీ గురించి తెగ వింటున్నాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే అప్లికేషన్ ఇది.

Unique Tea Stall: నీ తెలివి తేటలు సూపర్ భయ్యా.. చాయ్ జీపీటీ పేరుతో ఆకట్టుకుంటున్న వ్యాపారి..
Unique Tea Stall
Follow us on

కస్టమర్స్‌ను ఆకర్షించేందుకు వ్యాపారులు రకరకాల ఆఫర్స్‌ ప్రకటిస్తారు. కొందరు తమ దుకాణాలకు పెట్టే పేర్లతోనే కస్టమర్స్‌ని పడేస్తారు. అవును క్రియేటివిటీ ఉండాలే కానీ సక్సెస్‌ దానంతటదే వస్తుంది. ఇటీవల కొందరు యువకులు డిగ్రీ పట్టాలు పుచ్చుకొని ఉద్యోగాలు లేక తమకు తామే ఉపాధి కల్పించుకుంటున్నారు. అందులో భాగంగా వెలసినవే బీటెక్‌ చాయ్‌వాలా.. గ్రాడ్యుయేట్‌ చాయ్‌ దుకాణాలు. తాజాగా ఓ వ్యాపారి వీళ్లను తలదన్నేలా ఆలోచించాడు. ఇతను టెక్నాలజీని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతాడనుకుంటా.. తన చాయ్‌ దుకాణానికి ‘చాయ్‌ జీపీటీ’ అంటూ వినూత్నంగా పేరు పెట్టాడు. ఇందుకు సంబంధించిన పోస్ట్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

సృజనాత్మకత ఉంటే చాలు తమదైన ప్రత్యేక గుర్తింపును సులభంగా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఓ టీ వర్తకుడు చేసిన పని అలాగే ఉంది. ఇటీవల మనం చాట్ జీపీటీ గురించి తెగ వింటున్నాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే అప్లికేషన్ ఇది. మనం ఏ సమాచారం కోరినా క్షణాల్లో మనముందుంచే నేర్పరి. గూగుల్ సెర్చ్ కంటే సమర్థవంతమైన ఈ నూతన టెక్నాలజీ ఆవిష్కరణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇక్కడ ఓ తెలివైన వ్యాపారి ఈ చాట్‌జీపీటీని తన వ్యాపారానికి వాడుకున్నాడు. ‘చాయ్ జీపీటీ’ అని తన టీ కొట్టుకి బోర్డు తగిలించాడో తెలివైన వర్తకుడు.

తనచాయ్‌ దుకాణాన్ని చూడగానే చాట్‌జీపీటీ గుర్తొచ్చేలా చేశాడు. ఇది చాట్ బాట్ కాదు, కప్పు టీ తెచ్చిచ్చేది అంటూ ఓ సందేశాన్నిచ్చాడు. స్వాతి అనే ట్విట్టర్ యూజర్ ఇందుకు సంబంధించిన ఫొటోని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకున్నారు. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘‘సిలికాన్ వ్యాలీ: మా దగ్గర మెరుగైన స్టార్టప్ ఐడియాలు ఉన్నాయి’’అని స్వాతి పేర్కొన్నారు. మొత్తానికి టీ వర్తకుడు తన ఐడియాతో టెక్ తరం వారిని ఆకర్షించాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..