Viral News: రూ.2600 బిల్లు చేసి 8 లక్షల టిప్ ఇచ్చిన కస్టమర్.. సహోద్యోగులకు సమానంగా పంచిన ఉద్యోగం పోగొట్టుకున్న వెయిటర్

|

Feb 22, 2024 | 12:27 PM

ఆంగ్ల వెబ్‌సైట్ డైలీ మెయిల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం మిచిగాన్ నివాసి లిన్సే బోయిడ్ ఫేస్‌బుక్‌లో తనకు జరిగిన ఈ సంఘటన గురించి ప్రస్తావించారు. తాను సర్వ్ చేసిన టేబుల్ దగ్గర ఉన్న ఓ కస్టమర్     రూ.2600 బిల్లుని చేశాడు. అయితే ఆ కస్టమర్ తనకు రూ.8 లక్షల టిప్ ఇచ్చాడని.. ఈ చర్య వలన తాను  ఉద్యోగం పోగొట్టుకున్నానని తన ఫేస్ బుక్ లో పేర్కొంది.

Viral News: రూ.2600 బిల్లు చేసి 8 లక్షల టిప్ ఇచ్చిన కస్టమర్.. సహోద్యోగులకు సమానంగా పంచిన ఉద్యోగం పోగొట్టుకున్న వెయిటర్
Us Restaurant Fired Employee
Follow us on

ఫ్యామిలీతో లేదా స్నేహితులతో బయటకు వెళ్లి తినాలని భావిస్తే.. మంచి రెస్టారెంట్ కి వెళ్తారు. తమకు అక్కడ ఫుడ్ ను సర్వ్ చేస్తూ సేవను చేసేవారిని ఇష్టపడినవారు..  వారి సేవకు బదులుగా టిప్ ని ఇస్తారు. ఇలా కస్టమర్స్ నుంచి చిన్న మొత్తంలో టిప్ అందుకున్నా అక్కడ పనిచేసే వెయిటర్లకు, కుక్‌ల మనోధైర్యాన్ని పెంచుతుందని నమ్ముతారు. అంతేకాదు కస్టమర్లకు మరింత అంకిత భావంతో సేవ చేస్తారు. అయితే కస్టమర్ ఇచ్చిన టిప్ తో ఎవరైనా ఉద్యోగం కోల్పోతే? ఇది మీకు వింతగా అనిపించవచ్చు.. కానీ ఇది పూర్తిగా నిజం.

ఆంగ్ల వెబ్‌సైట్ డైలీ మెయిల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం మిచిగాన్ నివాసి లిన్సే బోయిడ్ ఫేస్‌బుక్‌లో తనకు జరిగిన ఈ సంఘటన గురించి ప్రస్తావించారు. తాను సర్వ్ చేసిన టేబుల్ దగ్గర ఉన్న ఓ కస్టమర్     రూ.2600 బిల్లుని చేశాడు. అయితే ఆ కస్టమర్ తనకు రూ.8 లక్షల టిప్ ఇచ్చాడని.. ఈ చర్య వలన తాను  ఉద్యోగం పోగొట్టుకున్నానని తన ఫేస్ బుక్ లో పేర్కొంది. ఆ రోజు ముదురు రంగు సూట్ ధరించిన ఒక మధ్య వయస్కుడు రెస్టారెంట్‌కి వచ్చి తనకు ఆహారం ఆర్డర్ ఇచ్చాడని ఆ మహిళ చెప్పింది. అతని బిల్లు చివరికి దాదాపు 32 డాలర్లు అంటే దాదాపు రూ. 2600.

ఇంత టిప్ ఎందుకు ఇచ్చాడంటే..

అయితే ఆ కస్టమర్ బిల్లు చెల్లించి హోటల్ నుంచి వెళ్లడానికి రెడీ అవుతూ తనకు 10,000 డాలర్లు అంటే సుమారు రూ. 8 లక్షలు ఇచ్చాడని వెల్లడించింది. ఇంత టిప్ ఇవ్వడానికి కారణం ఏంటి అని అడిగాను. దీనిపై ఆ వ్యక్తి మాట్లాడుతూ కొంత కాలం క్రితం తన హితుడు చనిపోయాడని, అతని అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఇక్కడికి వచ్చానని.. అతని పేరు మీద ఈ మొత్తాన్ని మీకు ఇచ్చానని చెప్పాడు. అతడు  చెప్పిన రీజన్ విన్న తర్వాత హోటల్ లో ఉన్న కస్టమర్స్  ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది.  స్నేహితుడి  ఆత్మకు శాంతి చేకూరుతుందని భావించారు.

ఈ టిప్ తీసుకున్న తర్వాత.. తాను తన స్నేహితులకి షేర్ చేశానని.. రెస్టారెంట్ యాజమాన్యం కూడా ఇష్టపడుతుందని అనుకున్నానని చెప్పింది. అయితే ఈ సంఘటన ఎదురుతిరిగింది. ఏకంగా ఆ వెయిట్రెస్ ను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇప్పుడు ఈ సమస్య  సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయంపై  రెస్టారెంట్ యజమాని అబెల్ మార్టినెజ్ కూడా స్పందిస్తూ.. బోయిడ్ కాల్పులకు, 10,000 డాలర్ల కు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. అయితే కార్మిక చట్టం ప్రకారం అతనిపై చర్యలు తీసుకున్నారు. అయితే, బాయ్డ్ స్పందిస్తూ, రెస్టారెంట్ ద్వారా మెడికల్ లీవ్ తీసుకోవాలని కోరాడు. అంతెందుకు, ఇక్కడ ఎవరైనా నా తప్పు అర్థం చేసుకుంటారా? అని కామెంట్ చేశారు. తర్వాత బోయిడ్ ఈ పోస్ట్‌ను సోషల్ మీడియా నుండి తొలగించాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..