Viral News: రోడ్డుమీద బీభత్సం సృష్టించిన మేకలు.. అరెస్ట్ చేసి జైలులో పెట్టిన పోలీసులు.. ఎక్కడంటే

|

Nov 29, 2024 | 12:59 PM

పోలీసులు అంటే ప్రజలకు సహాయం చేయడానికి నేరస్తులను శిక్షించి ప్రజలను రక్షించాడనికి విధులను నిర్వహించే వారు. అటువంటి పోలీసులు మేకల సృష్టిస్తున్న హంగామా నుంచి రక్షించమని కోరుకోవడంతో మేకలను పెట్టుకోవడానికి పరుగులెత్తారు. ఈ వింత ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.

Viral News: రోడ్డుమీద బీభత్సం సృష్టించిన మేకలు.. అరెస్ట్ చేసి జైలులో పెట్టిన పోలీసులు.. ఎక్కడంటే
Goats In Jail
Follow us on

చాలా చిన్నవిగా భావించే కొన్ని సమస్యలు.. ఒకొక్కసారి పెద్ద సమస్యగా మారతాయని ఎవరూ ఊహించి ఉండరు. తాజాగా ఒక సిల్లీ సంఘటన అనుకుంటే ఓ రేంజ్ లో హంగామా సృష్టించిన ఘటన అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో చోటు చేసుకుంది. తాజాగా నగరంలో చోటు చేసుకున్న సంఘటన ప్రపంచ వ్యాప్తంగా హెడ్‌లైన్స్‌లో నిలిచింది. దీనికి కారణం రెండు మేకలు! అసలు విషయం తెలిస్తే ఎవరైనా షాక్ తినాల్సిందే. ఈ రెండు మేకలను కష్టపడి పట్టుకున్న పోలీసులు జైల్లో పెట్టారు.

ఈ మేకల చేసిన తప్పు ఏమిటంటే..రోడ్డు పక్కన నడిచివెళ్లే వాళ్లను వెంబడించడం మొదలుపెట్టాయి. అయితే ఈ మేకలు తమతో సరదాగా గడుపుతున్నాడని మొదట్లో జనాలు అనుకున్నారు. పెద్దగా పెట్టించుకోలేదు. అయితే తర్వాత మేకలు రోడ్డుమీద రచ్చ రచ్చ చేయడం మొదలు పెట్టాయి. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ మేకలు తమని పట్టుకోవడనికి వచ్చిన పోలీసులపై సైతం కొమ్ములతో పొడుస్తూ యుద్దానికి దిగాయి. అవి ఎగబడుతున్న తీరుతో పోలీసుల మతి పోగొట్టేలా చేశాయి. పోలీసుల ఎదుటే మేకలు అక్కడ సృష్టించిన హంగామాతో వాటి నుంచి అక్కడ వారు తప్పించుకోవడం కష్టమని పోలీసులు భావించారు.

మేకల హంగామాపై పోలీసులు ఏం చెప్పారంటే

ఇవి కూడా చదవండి

ఇంగ్లిష్ వెబ్‌సైట్ డైలీ స్టార్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం ఈ మేకల జంట తమ యజమాని ఆశ్రయం నుంచి పారిపోయి రహదారి మీదకు చేరుకున్నాయి. మేకలు కోపంతో రోడ్డు మీద రచ్చ సృష్టించడం ప్రారంభించాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ మేకలను అదుపు చేసేందుకు సామాన్యుల నుంచి ప్రత్యేక శిక్షణ ఉన్న వారు అందరూ ఎంత ప్రయత్నించినా.. మేకల హంగామాని అడ్డుకోలేక పోయారు. అదే సమయంలో మేకలు ఇంకా రెచ్చిపోయి దూకుడు పెంచాయి. దీంతో సామాన్య ప్రజలు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మేకలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మేకలను అరెస్ట్ చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు. అయితే అది అనుకున్నంత సులభంగా జరగలేదు.

ఎట్టకేలకు కెంట్ పోలీస్ డిపార్ట్ మెంట్ వారు చాలా కష్టపడి ఈ మేకలను పట్టుకుని జైల్లో పెట్టారు. తమ ఇన్‌స్టాలో ఈ మేకల ఫోటోను కూడా షేర్ చేశారు. వాటిని చూస్తే గొర్రెలుగా కనిపిస్తాయి. అయితే ఇవి మేకలు. ఈ మేకలు ఎక్కడి నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చాయో ఇంకా తెలియరాలేదని.. అయితే ఈ మేకలు ప్రజలను చాలా ఇబ్బంది పెట్టాయని పోలీసులు చెబుతున్నారు. చాలా క్యూట్‌గా కనిపిస్తున్న మేకలు చాలా దూకుడుగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ మేకలను కౌంటీ యానిమల్ షెల్టర్‌లో ఉంచి వాటి యజమాని కోసం గాలిస్తున్నారు.

 

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..