Viral News: అధునిక ప్రపంచంలోనూ వర్గ వివక్షత.. పని మనిషి, ఇతర సేవా సిబ్బందికి వేర్వేరు లిఫ్టులు.. వైరల్ అవుతున్న ఫోటో!

|

May 08, 2022 | 1:04 PM

భారతదేశంలో ధనవంతులు, పేద అన్న వివక్షత కొత్త కాదు. దురదృష్టవశాత్తు, ఇంటి పనులు, డెలివరీ చేసే వ్యక్తులు మొదలైనవారు ప్రతిరోజూ వివక్షకు గురవుతున్న అనేక సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఇలాంటిదే ఒకటి తెరపైకి రావడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

Viral News: అధునిక ప్రపంచంలోనూ వర్గ వివక్షత.. పని మనిషి, ఇతర సేవా సిబ్బందికి వేర్వేరు లిఫ్టులు.. వైరల్ అవుతున్న ఫోటో!
Users Furious After Seeing
Follow us on

Viral News: భారతదేశంలోనే(Bharath) కాదు అనేక దేశాల్లో ఉన్నవారు, పేదవారు అన్న వర్గ వివక్షకొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఉన్నవారు, లేని వారు అనే తేడాలు మనదేశంలో ఇంకొంచెం ఎక్కువని పలు ఆరోపిస్తుంటారు. పాపం, ఇంటి పనులు, డెలివరీ చేసే వ్యక్తులు మొదలైన వారి పట్ల రోజూ వివక్ష చూపడం రోజువారీ జీవితంలో చాలా సర్వసాధారణం. అయితే ఇలాంటి సంఘటనలు మన కళ్ళ ముందు కనిపించినా అటువంటి వాటిని విస్మరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఇటువంటి వివక్షతకు బీజం మన ఇంటి నుంచే పడిందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. దీని తాజా చిత్రం ( నోటీస్ ) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . అది చూసిన తర్వాత బహుశా మనుషుల్లో మానవత్వం అంతమైపోయినట్లు అనిపిస్తోందని మీరు కూడా వ్యాఖ్యానించడం ఖాయం.

వైరల్ అవుతున్న ఫోటో పూణేలోని ఒక నాగరిక సమాజంలో ఉపయోగిస్తున్న లిఫ్ట్ గురించి ఉంది. తాము ఉన్నత వర్గం  భావాలను బాహాటంగా వ్యక్తపరిచేందుకు ఎలాంటి సిగ్గుపడడంలేదని సూచిస్తుంది ఈ చిత్రం.  తమ భవనంలో ఉన్న లిఫ్టుల్లో లిఫ్ట్ సి, డి లను మాత్రమే పనిమనిషి ఉపయోగిస్తారని.. మిల్క్‌మెన్‌లు, పేపర్‌ బాయ్స్, డెలివరీ బాయ్స్ కు , ఇతర సిబ్బంది, సేవా సిబ్బంది తదితరులు డీ లిఫ్ట్‌లను ఉపయోగించాలని నోటీసులో సూచించారు. అయితే ఇలా సేవలను అందించే వారిపై వివక్ష చూపడంపై చర్చ మళ్లీ వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ చిత్రాన్ని చూడండి

ఈ చిత్రాన్ని @sandeep PT అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘మానవులను వేరుగా చూడడం భారతీయులకు సహజంగా వస్తుంది. పూణేలోని అతిపెద్ద, పోషెస్ట్ సొసైటీలలో ఒకటి. వార్త రాసే సమయంలో 2.5 వేల మందికి పైగా ఈ ట్వీట్‌ను లైక్ చేశారు.

ఇది ఒక్క పూణేలో మాత్రమే కాదని.. దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో చాలా సాధారణమైన పద్ధతని అభిప్రాయపడ్డారు. మరికొందరు ఇలాంటి వర్ణ విచక్షణ తప్పు.. నోటీసును తప్పనిసరిగా తీసివేయాలని సూచించారు. మరికొందరు లిఫ్టులకు బదులుగా మెట్లను ఉపయోగించమని సహాయం కోరితే అది వివక్ష చూపుతుంది.. అంతేకానీ వారికోసం వేరే లిఫ్ట్ లను ఇస్తే.. ఇలా వివక్షత అంటుంది అంటూ సమర్థించే ప్రయత్నం చేశారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..