మీరు ఇప్పటి వరకూ మొబైల్ క్యాంటిన్స్, హోటల్స్, భోజనం, టిఫిన్స్ చూసే ఉంటారు. కానీ మొబైల్ షోరూమ్ ఎప్పుడైనా చూశారా. అసలు ఈ ఐడియా కూడా ఎవరికీ వచ్చి ఉండదు. బట్టలు కొనుక్కోవాలంటే ఖచ్చితంగా బయట షాపులకు వెళ్లాల్సిందే. అయితే కొంత మంది కాస్త నాశిరకంగా ఉన్న బట్టలను రోడ్ సైడ్ అమ్ముతూ ఉంటారు. ఒక ఐడియా జీవితాన్నే మర్చేస్తుంది అంటారు కదా. అదే ఐడియా ఇతనికి వచ్చినట్టు ఉంది. మొబైల్ షోరూమ్.. వినడానికే కొత్తగా ఉంది కదా.. ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో వైరల్ అవుతుంది. మరి ఈ ఫొటో వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
బెంగుళూరుకు చెందిన Pakchikpak రాజా బాబు అనే వ్యక్తి.. మొబైల్ వాక్ – ఇన్ – అపెరల్ షోరూమ్ అలా ఉన్న ట్రక్కును గుర్తించాడు. వెంటనే ఈ ఫొటో తీసి X అకౌంట్‌లో షేర్ చేశాడు. ఇందుకు సంబంధించిన డీటైల్స్ కూడా షేర్ చేశాడు రాజా బాబు. ‘నా భార్యతో కలిసి మందిర్‌కు వెళ్తున్నప్పుడు ఈ మొబైల్ షోరూమ్ కనిపించింది. ఈ ట్రక్కు లోపల సొగసైన బట్టలు ఉన్నాయి. ఇది హై ఎండ్ ఫ్యాషన్ షోరూమ్‌ను పోలి ఉంది అని చెప్పుకొచ్చాడు’.
In another episode of “WTF Bangalore,” spotted this truck while going to the mandir with my wife. pic.twitter.com/pUpCQuiczk
— Pakchikpak Raja Babu (@HaramiParindey) January 15, 2024
ప్రస్తుతం ఈ ఫొటో.. పోస్ట్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. ఈ ఫొటోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘మొబైల్ షోరూమ్ ఇలాంటి ఐడియా రావడం చాలా మంచిది’. మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ.. ‘ఒక వ్యక్తి.. ఇలాంటివి ప్రయత్నించడం చాలా ఆనందంగా ఉంది’. ‘ఒక మధ్య తరగతి వ్యక్తి తన అవసరాలను తీర్చడానికి ప్రయత్నించడంలో ఎటువంటి సమస్య లేదు.. ఇంకో నెటిజన్ చెబుతున్నాడు’.
మరో నెటిజన్ చెబుతూ.. ‘నేను ఫుడ్ ట్రక్కుల గురించి విన్నాను కానీ.. నేను రావడం చూడలేదు అని అంటున్నారు’. ఇలా పలువు నెటిజన్లు వారి వారి అభిప్రాయాలను షేర్ చేస్తున్నారు. మొత్తానికి బెంగుళూరులో ఉన్న ఈ మొబైల్ షోరూమ్‌కి విపరీతమైన ఫాలోయింగ్ దొరికింది. మరి దీనిపై యజమాని ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.