Viral News: న్యూయార్క్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ అపార్ట్ మెంట్‌లో పార్క్ చేసిన కోట్ల ఖరీదైన కారు కనిపించకుండా పోయింది. ఇంతకీ ఆ కారు కనిపించకుండా పోడానికి కారణం ఆ అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ గార్డే. అసలేం జరిగిందంటే…డాక్టర్ మికైల్ వర్షాస్కీ అనే వ్యక్తి రెండున్నర కోట్లు పెట్టి లంబోర్ఘినీ కారు కొన్నాడు. మే 6వ తేదీన తన అపార్ట్‌మెంట్ వద్ద పార్క్‌చేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతని కారు కనిపించకుండా పోయింది. అదే సమయంలో తమ కార్లు తీసుకోవడానికి వచ్చిన ఇతర అపార్ట్‌మెంట్ వాసులకు అక్కడ ఉండాల్సిన సెక్యూరిటీ గార్డు కనిపించలేదు. అతను ఎక్కడకు వెళ్లాడా? అని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే.. డాక్టర్ కారు తీసుకొని షికార్లు చేయడానికి వెళ్లిపోయాడు.
న్యూయార్క్ సిటీ పోలీసుల సమాచారం ప్రకారం.. ఆ కారు నగరమంతా చక్కర్లు కొట్టింది. తెల్లారి 6 గంటల సమయంలో మళ్లీ తిరిగొచ్చిన ఆ సెక్యూరిటీ గార్డు కార్ పార్క్ చేసేసి ఏమీ తెలియనట్లు కూర్చున్నాడు. దీనిపై స్పందించడానికి డాక్టర్ నిరాకరించారు. అలాగే ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. ఈ డాక్టర్ ఎవరో కాదు.. ఒకానొక సందర్భంలో ‘వరల్డ్ సెక్సీయెస్ట్ మ్యాన్’ పోటీలో పాల్గొని, డాక్టర్లలోనే అందగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల ఒక బాక్సింగ్ మ్యాచ్‌లో పాల్గొని ఉక్రెయిన్ సహాయార్ధం లక్ష డాలర్లు కూడా పోగు చేశాడు.
మరిన్ని వైరల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..