Viral News: బట్టతలనే బిల్‌బోర్డ్ గా మార్చుకున్న యువకుడు.. వేలల్లో సంపాదన

వంశపారపర్యంగా లేదా పురుష హార్మోన్ల తేడా వల్ల వచ్చే బట్టతలను ఒక సమస్యగా భావించి ఆందోళన చెందుతూ ఉంటారు. బట్టతలపై రకరకాల జోక్స్ వినిపిస్తూనే ఉంటాయి. దీంతో బట్టతల సమస్యతో ఇబ్బంది పడేవారు మందులు, లేజర్ థెరపీ, హెయిర్ ట్రాన్స్ ఫర్ వంటి రకరకాల చికిత్సను తీసుకుంటున్నారు. అయితే బట్టతల గురించి బెంగ ఎందుకు.. ఈ సమస్యని కూడా సద్వినియోగం చేసుకుంటే డబ్బులు సంపాదించవచ్చు అని నిరూపిస్తున్నాడో వ్యక్తి. తన తలను బిల్‌బోర్డ్‌గా మార్చి డబ్బులు సంపాదిస్తున్నాడు.

Viral News: బట్టతలనే బిల్‌బోర్డ్ గా మార్చుకున్న యువకుడు.. వేలల్లో సంపాదన
Ad On His Bald Head

Updated on: Jul 15, 2025 | 10:34 AM

బట్టతల వచ్చిందని బెంగ పడుతున్నారా.. ఇకపై అవమానకరం కాదు.. ఆదాయ వనరు అని కేరళలోని అలప్పుజకు చెందిన ట్రావెల్ వ్లాగర్ షఫీక్ హషీమ్ నిరూపించాడు. అతను తన బట్టతల తలను ప్రకటనల స్థలంగా మార్చుకున్నాడు. యాడ్ ను ప్రదర్శించడం ద్వారా రూ. 50,000 సంపాదించాడు.

అంబలపుళలోని కరూర్‌కు చెందిన 36 ఏళ్ల షఫీక్ తన ఫేస్‌బుక్ పేజీలో తన బట్టతలనే బిల్‌బోర్డ్‌గా మార్చుకోవాలనుకున్నాడు. ఆసక్తి బ్రాండ్‌లు ప్రకటనలు ఇవ్వమంటూ ఆహ్వానించాడు. తద్వారా తన బట్టతల సామర్థ్యాన్ని అన్వేషించాడు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో వందలాది కంపెనీలు షఫీక్ ను సంప్రదించాయి. ట్రావెల్ వ్లాగర్‌గా ఉన్న ప్రజాదరణ కూడా అతను చేసిన ప్రకటన క్లయింట్‌లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించింది. మొదటి ఒప్పందం కొచ్చికి చెందిన లా డెన్సిటే కంపెనీతో చేశాడు షఫీక్. అంతేకాదు తన బట్టతల తలపై ప్రకటనను ప్రదర్శించిన మొదటి భారతీయుడు తానేనని షఫీక్ పేర్కొన్నాడు.

ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియోలో షఫీక్ కొచ్చిలో ఉన్న ఒక హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ క్లినిక్ కోసం ఒక ప్రకటనను గర్వంగా తన నెత్తిమీద ప్రదర్శిస్తూ కనిపించాడు. బ్రాండ్‌ను ప్రమోట్ చేయడానికి అతను కంపెనీ పేరు , వివరాలతో కూడిన టాటూ స్టిక్కర్‌ను ఉపయోగించాడు. ఒప్పందం ప్రకారం షఫీక్ మూడు నెలల పాటు ఈ ప్రకటనను ప్రదర్శించాలి. ఈ సమయంలో అతను తన వ్లాగ్‌లలో టాటూ ఉన్న తలతో కనిపించాలి.

ఇవి కూడా చదవండి

 

28,000 కంటే ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్‌లతో ’70mm vlogs’ అనే యూట్యూబ్ ఛానెల్‌ను నిర్వహిస్తున్న షఫీక్ మొదట బట్టతలను సమస్యగా భావించి మొదట హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాలనుకున్నాడు. చాలా మంది బట్టతల ఉన్న వ్యక్తుల మాదిరిగానే, షఫీక్ కూడా స్నేహితులు, ఇతరుల నుంచి బాడీ షేమింగ్ , ఆటపట్టింపులను ఎదుర్కొన్నాడు. అయితే అదే సమయంలో కొంత లోతుగా ఆలోచించి అసలు బట్టతల గురించి ఆందోళన ఎందుకు? అది సహజం అని ఎందుకు సిగ్గుపడాలి అని భావించి నట్లు చెప్పాడు. నిజానికి, బట్టతల అందంగా ఉంటుందని తాను నమ్ముతానని ..ఇతరులకు ఈ విషయంపై నమ్మకం పెరిగేలా చూడాలని కోరుకున్నాడు. దీంతో బట్టతలను బిల్‌బోర్డ్‌గా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. తనకు వచ్చిన ఈ ఆలోచన గురించి షఫీక్ స్పందించాడు. ఈ నిర్ణయం తన బట్టతల తలను ప్రకటనల స్థలంగా మార్చుకుని తద్వారా డబ్బు సంపాదించడానికి తనకు ప్రేరణనిచ్చిందని చెప్పాడు షఫీక్.

 

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..