
సోషల్ మీడియాలో ప్రతి రోజూ చాలా రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల వైరల్ అయిన ఒక వ్యక్తి ఇప్పటివరకు చూడని జుగాడ్‌ని ప్రయత్నించాడు. అతడు ఇంట్లో స్టౌవ్ వెలిగించేందుకు పెద్ద స్టంట్‌నే ప్లే చేశాడు. అతడికి అందుబాటులో లైటర్, అగ్గిపెట్టె అందుబాటులో లేనప్పుడు అతను దోమల బ్యాట్‌ను ఉపయోగించి గ్యాస్ స్టవ్‌ను వెలిగించాడు. ఈ వినూత్న జుగాడ్ ట్రిక్ చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇది ఖచ్చితంగా భారతీయ ఆవిష్కరణ మాత్రమే అంటూ చాలా మంది నెటిజన్లను షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో ఇంటర్‌నెట్‌లో కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసేదిగా మారింది.
@MaanpalSin8672 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన ఇంట్లో గ్యాస్ స్టవ్‌ను వెలిగించడానికి వెరైటీ ట్రిక్ ఉపయోగించాడు. సాధారణంగా గ్యాస్ స్టవ్ వెలిగించడానికి లైటర్, అగ్గిపెట్టె లేనప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సివస్తుంది. కాబట్టి అతను ఇలాంటి అసాధారణ ట్రిక్ ట్రై చేశాడు. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి పైన దోమల బ్యాట్ పెట్టాడు. మరో చేతిలో ఒక పొడవైన చాకులాంటి వస్తువుతో ఆ బ్యాట్‌ను కొట్టడంతో వచ్చే షార్ట్ సర్క్యూట్‌తో స్పార్క్ తో స్టౌవ్ వెలిగింది.
इंडिया डे बाई डे न्यू अविष्कार कर रहा है
है कोई जो इंडिया वालो से टक्कर ले सके pic.twitter.com/pg80wRxBJR
— Maanpal Singh (@MaanpalSin8672) October 7, 2025
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్ బ్రో అంటూ కొందరు.. ఇంత తెలివి మన దేశం దాటి పోనివ్వకూడదంటూ మరికొందరు ఫన్నీగా స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…