Tamil Nadu: తమిళనాడులోని కొయంబత్తూరు(coimbatore) జిల్లాలో ఓ వ్యక్తి వింత అనుభవాన్ని ఫేస్ చేశాడు. ఒక ప్రైవేట్ ఆంగ్ల వార్తా దినపత్రికలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు సదరు వ్యక్తి. శనివారం రాత్రి (ఆగస్టు 27) తన పిల్లలు కోరడంతో.. ఐస్ క్రీమ్, చిప్స్ ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీలో ఆర్డర్ పెట్టాడు. నిమిషాల్లోనే హోమ్ డెలివరీ వచ్చేసింది. సర్వీస్ భలే ఫాస్ట్‌గా ఉందే అనుకున్నాడు. అయితే పార్శిల్ ఓపెన్ చేయగానే అతడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. అందులో ఐస్‌క్రీం, చిప్స్‌కు బదులు కండోమ్ ప్యాకెట్ ఉంది ఉంది. బిల్లు మాత్రం స్నాక్ ఐటమ్స్‌కే వేశారు. దీంతో విస్మయానికి గురైన సదరు వ్యక్తి.. ఆ కండోమ్ ప్యాకెట్ ఫోటో తీసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. స్విగ్గీ సంస్థను ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో స్వీగ్గీ స్పందించింది. రాంగ్ పార్శిల్ పంపినందుకు సారీ చెప్పింది. ఆర్డర్ నంబర్ తీసుకుని.. డబ్బు రిటన్ చేసినట్లు తెలిపింది. అయితే ఆ కస్టమర్ మాత్రం.. తనకు ఆర్డర్ పెట్టిన ఐస్ క్రీమ్, చిప్స్ పంపాలని కోరాడు. అతడి అభ్యర్థనకు స్పందించిన సంస్థ.. డబ్బులు ఆల్రెడీ వెనక్కి పంపామని.. కావాల్సిన వస్తువులు మళ్లీ ఆర్డర్ పెట్టుకోవాలని కోరింది.
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. టైమ్ వేస్ట్ చేసినందుకు ఆ కస్టమర్‌కు స్వీగ్గీ నష్టపరిహారం చెల్లించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. లైట్ తీసుకోమని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి