అమెరికాను తుఫాను వణికిస్తోంది. భారీ వర్షాలు, పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అలాంటి వాతావరణంలో.. సౌత్ కెరొలినాలో.. ఓ వ్యక్తి గొడుగు చేతబట్టుకుని నిర్మానుష్యమైన ప్రాంతంలో నడుస్తున్నాడు. అంతే ! ఒక్కసారిగా అతడ్ని సూటిగా తాకింది మెరుపు.. కళ్ళు జిగేల్ మనే ఆ మెరుపును చూడలేకపోగా.. షాక్ తగిలినట్టు ఒళ్ళంతా కదిలిపోయినంత పనయింది అతనికి. ఆ షాక్ తో గొడుగు వదిలేయడంతో అది కొంత దూరంలో ఎగిరి పడింది. ఆ వ్యక్తికి కేవలం కొన్ని అంగుళాల దూరంలో భూమిని టచ్ చేసి ఆ మెరుపు క్షణంలో మాయమైంది. సర్వేలెన్స్ కెమెరా ఈ దృశ్యాన్ని వీడియోకెక్కించింది. ఈ ‘ మెరుపు దాడి ‘ లో ఆ వ్యక్తి మాత్రం గాయపడకుండా తప్పించుకుని.. సురక్షితంగా తన మానాన తాను నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అమెరికాలో పిడుగుపాటుకు గురై 12 మంది మరణించినట్టు అంచనా.