Viral Video: ఈ జంతువు ఏంటో చెప్పగలరా.? భలేగా డ్యాన్స్ చేస్తోంది కదా.! వైరల్‌ వీడియో..

అందంగా, కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ జంతువు ఏంటో తెలుసా..? పైగా ఈ జంతువు భలేగా డ్యాన్స్‌ కూడా చేస్తోంది. ఆహ్లాదకరంగా ఉన్న అడవిలో ఈ అందమైన..

Viral Video: ఈ జంతువు ఏంటో చెప్పగలరా.? భలేగా డ్యాన్స్ చేస్తోంది కదా.! వైరల్‌ వీడియో..

Updated on: Jun 03, 2021 | 1:18 PM

అందంగా, కలర్‌ఫుల్‌గా ఉన్న ఈ జంతువు ఏంటో తెలుసా..? పైగా ఈ జంతువు భలేగా డ్యాన్స్‌ కూడా చేస్తోంది. ఆహ్లాదకరంగా ఉన్న అడవిలో ఈ అందమైన జంతువు ఆటలు ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. కోతుల్లో అనేక రకాలు ఉంటాయి. అందులో ఇవి కూడా ఒకటి. లెమర్స్‌ జాతికి చెందిన ఈ కోతుల్ని సిఫాకా అంటారు.

లెమర్స్‌ జాతి కోతులు ఎక్కుగా యూరప్‌లో కనిపిస్తాయి. తాజాగా అక్కడ స్థానికంగా ఉండే డ్యాన్స్‌ చెస్టర్‌ జూలో సిఫాకా డ్యాన్స్ చేస్తూ కనిపించగా.. దానికి సంబంధించిన వీడియోను చెస్టర్‌ జూ అధికారులు తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రపంచానికి అరుదుగా కనిపించే ఈ సిఫాకాల ఫన్నీ ‘డ్యాన్స్’ క్లిప్‌ వైరల్‌గా మారింది. వీడియో పోస్ట్ చేసిన నాటి నుంచి లక్షల సంఖ్యలో వ్యూస్‌, లైకులు వచ్చాయి. నెటిజన్లు ఆశ్చర్యకరమైన కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Jio Offers: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. అతి చవకైన ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. బెనిఫిట్స్ ఇవే..