మనుషులకు తొందరగా దగ్గరయ్యే జంతువుల్లో శునకాలు (Dogs) ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. అవి మానవులకు మంచి స్నేహితులు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. విధేయత, విశ్వాసంతో ఇంట్లో మనిషిలా కలిసిపోతాయి. వాటికి ఏదైనా నేర్పిస్తే చాలా బాగా ఫాలో అవుతారు. యజమాని, శునకాల మధ్య అనేక ఫన్నీ వీడియోలు (Funny videos) తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఇందులో తన యజమానిని ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాడు. అతని పక్కన కూర్చున్న కుక్క యజమాని వైపు చూస్తోంది. వీడియో చూస్తుంటే కుక్కకు తినాలని అనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఆ విషయాన్ని యజమానికి చెప్పలేకపోతోంది. అయితే యజమాని కుక్క వైపు చూడగానే అది వేరే వైపు చూడటం.. ఇలా ఈ ఫన్ పలు మార్పు రిపీట్ అవుతుంది. జిమ్మిక్ తో ఉన్న కుక్క వీడియో చూసి, నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
I’m not looking at your delicious food…I swear…??? pic.twitter.com/R1o9z0OfPt
ఇవి కూడా చదవండి— Laughs 4 All ? (@Laughs_4_All) July 17, 2022
ఈ ఫన్నీ వీడియో లాఫ్స్ 4 ఆల్ అనే ఖాతాతో ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ క్లిప్ ను14 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 72 వేల మందికి పైగా పోస్ట్‌ను లైక్ చేశారు. అంతే కాకుండా తమ బంధువులు, తెలిసిన వారు, స్నేహితులకు షేర్ చేస్తున్నారు. వీడియోను చూసి ఫన్నీ స్టైల్ లో కామెంట్లు చేస్తున్నారు.